Bigg Boss 5: ఈవారం నామినేషన్‌లో ఆరుగురు.. ఏడిపించేసిన బిగ్‌బాస్!

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్లు ఇంటి నుండి బయటకి వచ్చేయగా ఎనిమిదో వారం కూడా మొదలైంది. ఏడోవారం ఎలిమినేషన్ ముగిసిందో లేదో వెంటనే 8వ వారం ఎలిమినేషన్‌..

Bigg Boss 5: ఈవారం నామినేషన్‌లో ఆరుగురు.. ఏడిపించేసిన బిగ్‌బాస్!

Bigg Boss 5 (2)

Bigg Boss 5: బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్లు ఇంటి నుండి బయటకి వచ్చేయగా ఎనిమిదో వారం కూడా మొదలైంది. ఏడోవారం ఎలిమినేషన్ ముగిసిందో లేదో వెంటనే 8వ వారం ఎలిమినేషన్‌ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు టాస్కులు, గేమ్స్ తో ఈ నామినేషన్ ప్రక్రియ సాగించిన బిగ్ బాస్ ఈసారి ఎమోషన్స్ తో గేమ్ ఆడించాడు. కొద్ది వారాలుగా తమ ఇంటిలో సభ్యుల తీరు తెన్నుల ఆధారంగా తోటి సభ్యులు నామినేషన్ ప్రక్రియలో కారణాలు చెబుతూ నామినేషన్ ప్రక్రియ జరిగేది.

Deepika Ranveer: సోషల్ మీడియా సాక్షిగా రణ్వీర్‌ను తెగపొగిడేసిన దీపికా!

అయితే, ఎనిమిదో వారంలో కంటెస్టెంట్ల ఎమోషన్ ను పణంగా పెట్టి టాస్క్స్ ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్స్ ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి దూరమై 50 రోజులు పూర్తవుతుంది. ఇక వారికి ఎంతో ఇష్టమైన వారు ప్రత్యేకంగా లేఖలను కూడా పంపారు. అయితే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఆ లేఖలతోనే కొనసాగించడం విశేషం. దీంతో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత అయిన వాళ్ళ దగ్గర నుండి వచ్చిన లేఖలు కళ్ళ ముందు చినిగిపోతుంటే వారిలోని దుఃఖం ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది.

NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

మీకు ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరిస్తూ మొదలు పెట్టిన బిగ్ బాస్ ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందనే కాసెప్ట్ లో పవర్ రూమ్ లో ఉండే ఇద్దరితో రెండు లెటర్స్ తీయించి ఒకటి చించేసి మరొకటి కంటెస్టెంట్ కి ఇవ్వాలని కండిషన్ పెడతాడు. అలా ఒకరి కోసం ఒకరు త్యాగాలు, దుఃఖాలు, ఓదార్పుల మధ్య ఈ ఎపిసోడ్ భారంగా గడిచింది. మొత్తానికి ఎమోషన్స్ తో గేమ్స్ ఆడించిన ఈ వారం ఎపిసోడ్ లో ఈ వారం రవి, లోబో, శ్రీరామ్‌, సిరి, షణ్ముఖ్‌, మానస్‌ ఎలిమినేషన్ కు నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు.