Sonal Chauhan : ‘ఎఫ్ 3’ సినిమాలో బాలకృష్ణ హీరోయిన్

తమన్నా, మెహరీన్ ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో సందడి చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ ని కూడా తీసుకున్నట్టు సమాచారం. తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో లెజెండ్‌, డిక్టేట‌ర్, రూల‌ర్

Sonal Chauhan : ‘ఎఫ్ 3’ సినిమాలో బాలకృష్ణ హీరోయిన్

Sonal (1)

Sonal Chauhan :  ‘ఎఫ్ 2’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారీ విజయం సాధించి 100 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ పేరుతో రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ‘ఎఫ్ 2’ సినిమాలోని మొత్తం ఆర్టిస్టులతో పాటు మరి కొంతమందిని అదనంగా యాడ్ చేశారు ఈ సీక్వెల్ లో. అనిల్ రావిపూడి ఈ సినిమాని కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

Radheshyam : స్టార్ హీరోల రికార్డులని బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్’ టీజర్

ఇప్పటికే ఈ సినిమాలో సునీల్ కూడా ఒక భాగమయ్యాడు. ప్రస్తుతం తమన్నా, మెహరీన్ ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో సందడి చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ ని కూడా తీసుకున్నట్టు సమాచారం. తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో లెజెండ్‌, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాలలో నటించి అలరించిన సోనాల్ చౌహన్ ‘ఎఫ్ 3’ సినిమాలో నటించనుంది. ఈ బ్యూటీ అందాల ఆరబోతలో కూడా ఏ మాత్రం తగ్గదు. ఆల్రెడీ ఇద్ద‌రు మంచి గ్లామ‌ర్‌ హీరోయిన్స్ ఉన్నారు. మరి సోనాల్ ని ఎందుకు తీసుకున్నారో అనిల్ రావిపూడికే తెలియాలి. సోనాల్ తో ‘ఎఫ్ 2’ సినిమాలో అనసూయ లాగా ఏదైనా స్పెషల్ క్యారెక్టరా? లేక ఏదైనా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారా చూడాలి. ప్రస్తుతం షూటింగ్ లో కూడా పాల్గొంటుందని ఈ భామే తెలిపింది.

Bigg Boss 5 : 75 రూపాయలతో ఇంట్లోంచి పారిపోయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా: ప్రియాంక

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాల్ మాట్లాడుతూ.. నేను ‘ఎఫ్ 2’ సినిమా చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. ‘ఎఫ్ 3’లో భాగ‌మ‌వుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’లో న‌టించాల‌ని న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు నాకు చాలా ఆనంద‌మేసింది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో న‌టిస్తున్నాను. ఇది వ‌ర‌కు నేను చేసిన చిత్రాల్లో పాత్ర‌ల‌కు ఈ పాత్ర పూర్తిగా విభిన్న‌మైన‌ది. డైరెక్టర్ గా అనీల్ రావిపూడి చెప్పినట్టు చేస్తున్నాను అని తెలిపింది ఈ బ్యూటీ.