Sonu Sood : బచ్చన్ ఫ్యామిలీ గురించి ‘రియల్ హీరో’ ఏం చెప్పారంటే..

బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు సోనూ సూద్..

Sonu Sood : బచ్చన్ ఫ్యామిలీ గురించి ‘రియల్ హీరో’ ఏం చెప్పారంటే..

Sonu Sood

Sonu Sood: కరోనా కష్టకాలంలో అది, ఇది అని కాకుండా అన్ని రకాలుగా తన వంతు సేవ చేస్తూ.. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సాయమందిస్తున్నారు ‘రియల్ హీరో’, ‘హెల్పింగ్ హ్యాండ్’ సోనూ సూద్. శుక్రవారం (జూలై 30) సోనూ సూద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోనూ ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లతో కలిసి పనిచెయ్యడం గురించి, వారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు సోనూ సూద్.

Amitabh Bachchan

 

ఆయన మాట్లాడుతూ.. ‘‘బిగ్ బి తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలో నటించాను. షాట్ గ్యాప్‌లో అందరు స్టార్లలా కారవాన్‌లోకెళ్లి రిలాక్స్ అవకుండా.. సెట్లోనే కూర్చుని తర్వాత చెయ్యబోయే సీన్ కోసం తన డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేసేవారు అమితాబ్. ఆయణ్ణి చూసి నేను కూడా రిహార్సల్స్ చేస్తుంటే హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పటికీ చేసే ప్రతి సినిమానీ నా ఫస్ట్ సినిమాలానే భావిస్తాను. కొన్నిసార్లు రాత్రిపూట నిద్ర లేచి, నా డైలాగ్స్ ప్రాక్టీస్ చెయ్యడం, రీ రైట్ చేసి డైరెక్టర్‌కి మెసేజ్ చెయ్యడం చేస్తుంటాను.

Abhishek Bachchan

 

అభిషేక్ బచ్చన్‌తో ‘యువ’ లో యాక్ట్ చేశాను. తండ్రిలానే తను కూడా పని పట్ల ప్యాషన్ అండ్ డెడికేషన్‌తో ఉంటారు. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో ‘జోధా అక్బర్’ లో రాణి జోధా భాయి కజిన్, మహారాజా సుజమాల్ క్యారెక్టర్‌లో నటించాను. ఒక ఎమోషనల్‌ సీన్‌లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఐశ్యర్య, ‘మా నాన్నని గుర్తుచేశారు’ అన్నారు.. అప్పటినుండి ఆమె నన్ను ‘భాయ్ సాబ్’ అని పిలుస్తారు’’.. అని చెప్పుకొచ్చారు ‘రియల్ హీరో’ సోనూ సూద్.

Aishwarya Rai