Spider Man-No Way Home: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న స్పైడర్ మ్యాన్!

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు హై స్పీడ్ మీదొస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మంచి హాలీడే సీజన్, భారీ ఎక్స్ పెక్టేషన్స్.. సో డిసెంబర్ 17 రిలీజ్ తో పెద్ద సంచలనానికే తెరదీయాలని..

Spider Man-No Way Home: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న స్పైడర్ మ్యాన్!

Spider Man No Way Home

Spider Man-No Way Home: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు హై స్పీడ్ మీదొస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మంచి హాలీడే సీజన్, భారీ ఎక్స్ పెక్టేషన్స్.. సో డిసెంబర్ 17 రిలీజ్ తో పెద్ద సంచలనానికే తెరదీయాలని డిసైడయ్యాడు. ఇప్పటికే ట్రైలర్ తో అన్ని సినిమాల రికార్డ్ లను కొల్లగొట్టిన స్పైడర్.. లేటేస్ట్ నో వే హోమ్ తో ఇంకా ఎన్ని స్టన్నింగ్ స్టంట్స్ చేయబోతున్నాడు. స్పైడర్ మాన్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ ఆడియెన్స్. ఇప్పటిదాకా రిలీజైన 8 స్పైడర్ మూవీస్ లకు మించి అన్నట్టు ట్రైలర్ తోనే ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారు మేకర్స్.

Urfi Javed: మళ్ళీ రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. హాట్ పోజులు!

గత సినిమాల్లోని విలన్లలందరివీ ఇందులో ఇంక్లూడ్ చేయడం, డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ కోసం రంగంలోకి దిగడం, అన్నింటికి మించి అన్నట్టు స్పైడర్ ఇందులో ట్రిపుల్ రోల్ చేసాడనే టాక్ రావడంతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక స్పైడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అందులోనూ ఫారెన్ కంట్రీస్ లో డిసెంబర్ ఎండింగ్ మొత్తం హాలిడే సీజన్. ఇదే అదనుగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు స్పైడర్ మ్యాన్ దూసుకొస్తున్నాడు.

RRRలో ఐటెం సాంగ్ ఉందా మావా.. ఆర్ఆర్ఆర్ టీం ఫన్నీ రిప్లై!

‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ కు ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సినిమాలు బాక్సాఫీస్ పై కాసుల వర్షం కురిపించాయి. 2002లో రిలీజైన స్పైడర్ మ్యాన్ నుంచి.. 2019లో వచ్చిన ఫార్ ఫ్రమ్ హోమ్ వరకు వేల కోట్లు రాబట్టాయి. ఇక ఈ ఇయర్ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బ్లాక్ విడో, షాంగ్ – ఛీ, ఎటర్నల్స్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టాలనేది ఈ కొత్త స్పైడర్ మాస్టర్ ప్లాన్. ఇప్పటికే స్పైడర్ మ్యామ్ నో వే హోమ్ ట్రైలర్ కి.. హాలీవుడ్ లో ఏ సినిమాకి రాని వ్యూస్ 24గంటల్లో వచ్చాయి. సేమ్ ఇదే స్టామినా కలెక్షన్స్ లోనూ రాబడతామనే ధీమాతో ఉన్నారు మేకర్స్.

Tollywood Crazy Films: క్రేజీ కాంబోలు.. ఎటు చూసినా ప్రమోషన్ల రచ్చే!

గత సిరీస్ లో మంచివాడిగా నటించిన విలన్ మిస్టీరియోను స్పైడర్ మ్యాన్ అంతం చేయడంతో.. ప్రజలంతా స్పైడర్ మ్యాన్ ను శత్రువులా చూస్తారు. అంతేకాదు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోవడంతో సమస్యలు ఎక్కువైనట్టు ‘నో వే హోమ్’ సీరిస్ లో చూపిస్తున్నారు. అందుకే జనాలు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మరిచిపోయేలా చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. అయితే పీటర్ కోసం పాత శత్రువులు తిరిగి రావడం.. డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో స్పైడర్ మ్యాన్ వారితో ఎలా పోరాడాడనేందుకు తెలుసుకోడానికే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు.