Squid Game: స్క్విడ్‌గేమ్‌లో ‘అలీ’ మనవాడే.. అసలు పేరు అనుపమ్ త్రిపాఠి!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో స్క్విడ్ గేమ్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. నిజజీవితాలను చాలా దగ్గరి పాత్రలు ఈ సిరీస్ లో ఉండడం.. గేమ్ లో ఓడితే..

Squid Game: స్క్విడ్‌గేమ్‌లో ‘అలీ’ మనవాడే.. అసలు పేరు అనుపమ్ త్రిపాఠి!

Squid Game

Squid Game: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో స్క్విడ్ గేమ్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. నిజజీవితాలను చాలా దగ్గరి పాత్రలు ఈ సిరీస్ లో ఉండడం.. గేమ్ లో ఓడితే ప్రాణాలు పోయే ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ ను ఇప్పుడు అంతర్జాతీయంగా సూపర్ డూపర్ హిట్ చేసి పెట్టాయి. కాగా ఇందులో ప్లేయర్‌ 199గా, అలీ అబ్దుల్‌గా అదరగొట్టిన నటుడిని ప్రేక్షకులు అంతా సులభంగా మర్చిపోలేరు.

Ileana D’Cruz: ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసిన ఇల్లీ.. కారణం ఏంటంటే?

గేమ్ ఓడితే ప్రాణాలు పోతాయని తెలుసు కనుక.. ప్లేయర్స్ ఎవరూ పక్కవాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. కానీ.. అలీ మాత్రం అందరి ప్రాణాలను కాపాడుతూ తాను కూడా గేమ్ లో ఓడిపోకుండా ప్రాణాలు కాపాడుకొనేలా పాకిస్థాన్‌ వలస కార్మికుడిగా తీవ్ర ఒత్తిడితో కూడిన పాత్రలో అదరగొట్టాడు. కాగా.. అలీ పాత్రలో నటించిన వ్యక్తి భారతీయుడేనట. ఇతని అసలు పేరు అనుపమ్ త్రిపాఠి. దేశ రాజధాని దిల్లీలోనే పుట్టి పెరిగిన అనుపమ్.. నాటకరంగం మీదున్న ఆసక్తితో 2006 నుంచి 2010 వరకు దిల్లీలోని ప్రముఖ నాటక సంస్థలలో కూడా పనిచేశాడు.

Isha Chawla: తడి దుస్తులతో దాహం పెంచిన ఢిల్లీ భామ!

అయితే, ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ‘కొరియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో స్కాలర్‌షిప్‌ దక్కడంతో ఆ నేలపై అడుగుపెట్టాడు. శిక్షణ పూర్తయ్యాక అక్కడే నటుడిగా నిరూపించుకోడానికి విశ్వప్రయత్నాలు చేసిన అనుపమ్.. కొరియన్‌ భాష నేర్చుకొని అక్కడే సినీ పరిశ్రమకి చెందిన వారితో పరిచయాలు పెంచుకుంటూ శిక్షణ పూర్తిచేసుకున్నాక కొరియన్‌ నాటకాల్లో పలు ప్రదర్శనలిస్తూ.. సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ఏళ్లుగా ఒక్క అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నించిన అనుపమ్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరిశాడు.

Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?

అలా స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ లో పాకిస్తాన్ వలస కార్మికుడి పాత్ర దక్కడంతో అనుపమ్ సుడి తిరిగింది. అనుకున్న స్థాయి కంటే ఈ పాత్రలో అదరగొట్టిన అనుపమ్ ఇప్పుడు ఇంటెర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఎంతలా అంటే అలీ పాత్రకి ముందు 3వేల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్ స్టా ఖాతాకు ఇప్పుడు 3.5 మిలియన్లకు చేరింది. కొరియన్ భాషలో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మాతృబాషలో మంచి అవకాశాలు వస్తే చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్న అనుపమ్.. బాలీవుడ్ క్లాసిక్ సాంగ్స్ అంటే పడిచస్తానని చెప్పాడు.