Sree Leela : నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’లో రాణి ఈమె?

నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. పెళ్లి......

Sree Leela : నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’లో రాణి ఈమె?

Sree Leela

Sree Leela :  యువ కథానాయకులలో ఇటీవల మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో అందర్నీ నవ్వించి మెప్పించాడు నవీన్. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నవీన్ పోలిశెట్టి కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Gandhi : Why I Killed Gandhi .. సినిమాని బ్యాన్ చేయాలంటూ..

నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. పెళ్లి నేపథ్యంలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ టీజర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాజుకి రాణిగా ‘పెళ్లిసందD’తో ప్రేక్షకుల్ని అలరించిన కొత్త హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నట్టు సమాచారం. నవీన్‌ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటించేందుకు శ్రీలీల ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలుపెట్టనున్నారు.