Sree Vishnu : 14 ఏళ్లుగా స్నేహితులం.. ఇప్పటికి సినిమా కుదిరింది

ఈవెంట్ లో హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు కార‌ణం సాయి కొర్ర‌పాటిగారే. ఆయ‌న డేరింగ్ నిర్మాత‌. వారాహి సంస్థ‌లో ప‌నిచేయ‌డం సంతోషంగా వుంది. డైరెక్టర్ చైత‌న్య, నేను 14 ఏళ్ళుగా..........

Sree Vishnu : 14 ఏళ్లుగా స్నేహితులం.. ఇప్పటికి సినిమా కుదిరింది

 

Bhala Tandanana :  యువ హీరో శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. నారా రోహిత్ మొదటి సినిమా బాణం తెరకెక్కించిన చైతన్య దంతులూరి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పలు వాయిదాల అనంతరం మే6న ఈ సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ ఆదివారం విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో ప్రేక్ష‌కులని `ట్రైల‌ర్ రిలీజ్‌` తినమని చెప్పి వారితోనే ట్రైలర్ లాంచ్ చేయించారు.

Laal Singh Chaddha: అమీర్‌ఖాన్ భుజాలపై భారీ భారం.. బాలీవుడ్‌కు మళ్ళీ క్రేజ్ తెస్తాడా?

ఈ ఈవెంట్ లో హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ.. ”ఈ సినిమాకు కార‌ణం సాయి కొర్ర‌పాటిగారే. ఆయ‌న డేరింగ్ నిర్మాత‌. వారాహి సంస్థ‌లో ప‌నిచేయ‌డం సంతోషంగా వుంది. డైరెక్టర్ చైత‌న్య, నేను 14 ఏళ్ళుగా స్నేహితులం కానీ మా ఇద్దరికీ సినిమా ఇప్పటికే కుదిరింది. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోగా చేశాను. ఇదే సిరిపురంలో ఒకప్పుడు థియేట‌ర్‌లో సినిమాలు చూసేవాడిని. ఇక్క‌డి వారు జ‌న్యూన్ రిపోర్ట్ ఇస్తారు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ బాగా న‌టించింది. ఆమె కెరీర్‌ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇక కెజిఎఫ్‌ గ‌రుడ రామ్‌గారు టాప్ విల‌న్‌గా మారారు. ఆయన మా సినిమాలో నటించినందుకు ధన్యవాదాలు. ఆయ‌న బ‌య‌ట చాలా సాఫ్ట్‌గా వుంటారు. కెజిఎఫ్ త‌ర్వాత ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం చాలా బాగుంది. మే6న సినిమాను థియేట‌ర్‌కు వ‌చ్చి చూడండి. మీరు పెట్టే టికెట్‌ కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం. మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది” అని తెలిపారు.