Bigg Boss 5 : నేను ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. సిరికి షాకిచ్చిన శ్రీహాన్

శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నవా? అని అడగడంతో సిరి తప్పు చేసినదానిలా గుంజీలు తీసింది. అది చూసి శ్రీహాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నేనొకర్ని ప్రేమిస్తున్నాను, రెండు రోజుల క్రితమే.......

Bigg Boss 5 : నేను ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. సిరికి షాకిచ్చిన శ్రీహాన్

Siri Sreehan

Bigg Boss 5 :  గత మూడు రోజులుగా బిగ్ బాస్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ కి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక మొన్నటి ఎపిసోడ్ లో సిరి మదర్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో సిరి ప్రియుడు శ్రీహాన్ వచ్చాడు. అయితే కంటెస్టెంట్స్ వాళ్ళకి విలువైన వస్తువులని త్యాగం చేస్తేనే వారి కోసం స్పెషల్ పర్సన్స్ వస్తారని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా వారికి బాగా ఇష్టమైన వస్తువులని ఇచ్చేయడంతో వాళ్ళ కోసం స్పెషల్ పర్సన్స్ వచ్చారు. దీంతో సిరి.. తనకు కాబోయే భర్త శ్రీహాన్‌ కానుకగా ఇచ్చిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేసింది.

Bigg Boss 5 : సచ్చినోడా అంటూ షణ్నుని స్టేజిపైనే తిట్టేసిన దీప్తి..

ఆ తర్వాత శ్రీహాన్‌ను స్టేజీమీదకు వచ్చాడు. చాన్నాళ్ల తర్వాత ప్రియుడు వస్తుండటంతో సిరి ఏడ్చేసింది. కనీసం తలెత్తి కూడా చూడలేదు. దీంతో శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నవా? అని అడగడంతో సిరి తప్పు చేసినదానిలా గుంజీలు తీసింది. అది చూసి శ్రీహాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పగానే సిరి నవ్వింది. బాత్రూంలో తల బాదుకుని ఎందుకు గోడలు పగలగొడుతున్నావని సరదాగా ఏడిపించాడు.

Sreenu Vaitla : డైరెక్టర్ శ్రీనువైట్లకు పితృవియోగం.. సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

ఆ తర్వాత సిరి వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతూ.. శ్రీహాన్‌ షార్ట్‌ఫిలిం రిలీజైనప్పుడు తాను గెస్ట్‌గా వెళ్లానని, అక్కడ తన ప్రేమకథకు పునాది పడిందని చెప్పింది. ఇక సిరి పక్కన తాను లేకపోయినా ఆమెకు తోడుగా ఉంటూ రక్షిస్తున్నందుకు షణ్నుకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఆ తర్వాత సిరిని ఏడిపించడానికి నీకో సీక్రెట్‌ చెప్పాలి అన్నాడు. నేనొకర్ని ప్రేమిస్తున్నాను, రెండు రోజుల క్రితమే ప్రపోజ్‌ చేశాను. మెసేజ్‌ కూడా పెట్టాను అని చెప్పడంతో సిరి షాక్ అయింది. అయితే అటు నుంచి థ్యాంక్స్‌ యూ శ్రీహాన్‌ మామా అని రవి కూతురు వియా రిప్లై ఇచ్చిందని చెప్పడంతో అందరూ నవ్వేశారు. సిరి కోసం పాట కూడా పాడాడు. చివరగా మీలో మీరు కొట్టుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండని చెప్తూ సిరికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.