Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రొమాన్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన వీరయ్య!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చిరు చాలా రోజుల తరువాత పక్కా మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో బాస్ స్వాగ్‌ను థియేటర్లలో చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రొమాన్స్‌కు డేట్ ఫిక్స్ చేసిన వీరయ్య!

Sridevi Chiranjeevi Song From Waltair Veerayya Locks Date

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చిరు చాలా రోజుల తరువాత పక్కా మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో బాస్ స్వాగ్‌ను థియేటర్లలో చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Waltair Veerayya: వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య.. తగ్గేదే లే అంటోన్న సీనియర్స్!

కాగా, ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్‌ను ఫ్రాన్స్‌లో షూటింగ్ జరపుకుంటున్నట్లు చిరు తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలియజేశాడు. అంతేగాక, ఈ సాంగ్‌కు సంబంధించి ఓ బిట్‌ను చిరు లీక్ చేశారు. ఇక తాజాగా ఈ రొమాంటిక్ సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘శ్రీదేవి చిరంజీవి’ అనే ఈ పాటను డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్‌తో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్‌లో మంచు కురుస్తుండగా శ్రుతి హాసన్‌తో చిరు రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.

Waltair Veerayya : ‘నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి’.. సాంగ్‌ లీక్‌ చేసిన మెగాస్టార్‌..

ఇక ఈ పాట ఎలా ఉండబోతుందా, బాస్ తన గ్రేస్‌తో ఎలాంటి స్టెప్పులు వేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.