Peddha Kapu 1 Teaser : ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్‌తో పెదకాపు 1 టీజర్.. రా అండ్ రస్టిక్ తో..

'ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న పెదకాపు 1 టీజర్ ని ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్ తో మొదలుపెట్టి స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు శ్రీకాంత్ అడ్డాల.

Peddha Kapu 1 Teaser : ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్‌తో పెదకాపు 1 టీజర్.. రా అండ్ రస్టిక్ తో..

Srikanth Addala Peddha Kapu 1 teaser released

Peddha Kapu 1 Teaser : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే వెంకటేష్ తో ‘నారప్ప’ వంటి ఊర మాస్ మూవీ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాతో తనలోని మాస్ ని కొంత వరుకే చూపించిన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు ‘పెద్ద కాపు’ అనే సినిమాతో తనలోని పూర్తి మాస్ ని బయట పెట్టబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి ఒక సామజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ గా పెట్టి సంచలనం సృష్టించాడు.

Iswarya Menon : పవన్ OGలో ఛాన్స్ కొట్టేసిన స్పై భామ ఐశ్వర్య.. నిజమేనా?

‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ హీరోగా నటించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్ తో ఈ టీజర్ ని మొదలుపెట్టి సినిమా కథాంశం ఏంటో చెప్పేశాడు. ఒక ఊరిలోని ఇద్దరు పెద్దమనుషులు మధ్య చిక్కుకొని ఎన్నో బాధలు పడుతున్న సామాన్య జనం.. వారి పై తిరగబడి ఎలా పోరాటం చేశారు అనేదే సినిమా స్టోరీ లైన్ అని తెలుస్తుంది. పొలిటికల్ డ్రామాతో కూడుకున్న ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడని టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది.

ఇక ఈ సినిమాని అఖండ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, బ్రిగడ సగ, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు.