Srinidhi Shetty : నాకు డబ్బే కావాలి అంటున్న KGF హీరోయిన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసి..

శ్రీనిధి KGF రెండు పార్టుల్లో నటించిన తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా అడిగితే రెమ్యునరేషన్..............

Srinidhi Shetty : నాకు డబ్బే కావాలి అంటున్న KGF హీరోయిన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసి..

Srinidhi

Srinidhi Shetty :  ఇటీవల KGF2 సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. గతంలో KGF, ఇప్పుడు KGF2 రెండూ కూడా భారీ విజయం సాధించి కన్నడ సినీ పరిశ్రమకి మరింత పేరుని తెచ్చాయి. ఇక ఈ సినిమాలో నటించిన వారికి, సినిమాకి పని చేసిన వారికి దేశమంతటా పేరు వచ్చింది. ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి KGF మొదటి సినిమా. దీంతో మొదటి సినిమాతోనే భారీ విజయం దక్కించుకోవడంతో ఈ హీరోయిన్ ఆనందానికి అంతులేదు.

శ్రీనిధి KGF రెండు పార్టుల్లో నటించిన తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా అడిగితే రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసిందట. సౌత్ లో స్టార్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ ని రెండు సినిమాలకే శ్రీనిధి అడుగుతుంది నిర్మాతలు అంటున్నారు.

Shanmukh Jaswanth : యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం.. బాధలో షన్ను..

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ KGF భామని యాంకర్.. మీకు పేరు కావాలా? లేక, డబ్బు కావాలా? అని అడిగితే శ్రీనిధి వెంటనే.. ‘నాకు డ‌బ్బే కావాలి’ అని తెలిపింది. దీంతో ఈ భామ వచ్చిన పేరుని వినియోగించుకొని బాగా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని బాగా ఫాలో అవుతుంది శ్రీనిధి. మరి శ్రీనిధి అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి నిర్మాతలు సినిమాల్లోకి తీసుకుంటారో లేదో చూడాలి.