Srinidhi Shetty : ఏ భాషలో నటించడానికైనా రెడీ.. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

మోడల్ గా ఉన్న ఈమె 'కేజిఎఫ్ 1' సినిమాతోటే తెరంగ్రేటం చేసింది. మొదటి సినిమానే ఇంత భారీ సినిమా రావడంతో శ్రీనిధి శెట్టికి మంచి పేరు లభించింది. శ్రీనిధి మాట్లాడుతూ.. ''నటిగా అవార్డులు పొందడం కంటే కూడా.............

Srinidhi Shetty : ఏ భాషలో నటించడానికైనా రెడీ.. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

Srindhi Shetty

Srinidhi Shetty :   ప్రస్తుతం దేశమంతటా ‘కేజిఎఫ్ 2’ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరొచ్చింది. ఇక ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా ఈ సినిమాతో బాగా పేరొచ్చింది. ‘కేజిఎఫ్ 1’ సినిమాలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నా ‘కేజిఎఫ్ 2’లో మాత్రం ఎక్కువ నిడివి ఉంది. రీనా క్యారెక్టర్ లో ఈమె మెప్పించింది. ‘కేజిఎఫ్ 2’లో ఈ క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యత కూడా ఉంది. మోడల్ గా ఉన్న ఈమె ‘కేజిఎఫ్ 1’ సినిమాతోటే తెరంగ్రేటం చేసింది. మొదటి సినిమానే ఇంత భారీ సినిమా రావడంతో శ్రీనిధి శెట్టికి మంచి పేరు లభించింది.

Ram Charan : ‘ఆచార్య’లో నేను ఉన్నానని నాకే తెలీదు..

ప్రస్తుతం విక్రమ్ సరసన తమిళ్ లో కోబ్రా సినిమాలో నటిస్తుంది శ్రీనిధి. ‘కేజిఎఫ్ 2’ విజయం తర్వాత మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. తాజాగా ఓ తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీనిధి. ఈ ఇంటర్వ్యూలో శ్రీనిధి మాట్లాడుతూ.. ”నటిగా అవార్డులు పొందడం కంటే కూడా గొప్ప సినిమాలలో భాగమవ్వాలనే నేను కోరుకుంటున్నాను. మంచి సినిమాలో నటిస్తే సహజంగానే ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఒక నటిగా నేను భాషా హద్దులు పెట్టుకోవడం లేదు. ఏ భాష సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చినా నటించేందుకు సిద్ధం. నా అభిమాన హీరోల జాబితా కాస్త పెద్దదే. ప్రతి ఇండస్ట్రీలోనూ నేను కలిసి నటించాలని కోరుకుంటున్న స్టార్స్‌ నలుగురైదుగురు ఉన్నారు” అని తెలిపింది. మరి ఈ ‘కేజిఎఫ్’ భామ తెలుగులో ఎప్పుడు, ఎవరితో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.