RRR డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి.. గూస్ బంప్స్ గ్యారంటీ

కపిల్ టీం వరల్డ్ కప్ అందుకున్న సందర్భం మరిచిపోలేనిదని చెప్పారు రాజమౌళి.

RRR డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి.. గూస్ బంప్స్ గ్యారంటీ

Ss Rajamouli Rrr Dialogue

RRR: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఎక్కడ కనిపించినా న్యూసే. #RRR లాంటి మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉండటంతో… ఆయన ఎక్కడ కనపడ్డా.. ఏది చెప్పినా… అది న్యూసే అవుతుంది. టీమిండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ తో కలిసి ఇవాళ(నవంబర్ 8, 2021) రాజమౌళి ఓ చారిటీ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ లో.. కపిల్ దేవ్ క్రికెట్ ఆడిన నాటి రోజులు గుర్తుచేసుకుంటూ… ఆర్ఆర్ఆర్ మూవీ డైలాగ్ ను కూడా చెప్పేశాడు రాజమౌళి.

” నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి” … ఇదీ ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన డైలాగ్. చారిటీ ప్రోగ్రామ్ కు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్న సందర్భంగా.. రాజమౌళి ఈ మాటలు గుర్తుచేసుకున్నారు. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ ను లైవ్ లో చూడకపోయినా… గాల్లో ఉన్న బంతిని కపిల్ క్యాచ్ అందుకున్న క్షణాన తమ గుండె ఆగిపోయినంత సంతోషం, ఉద్వేగం కలిగిందని చెప్పాడు రాజమౌళి.

Read This : Sooryavanshi : పాండెమిక్ తర్వాత బుల్లెట్ దిగింది.. వంద కోట్ల క్లబ్‌లో! 

సినీ నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్ ఫౌండేషన్ సతీష్ గారు పరిచయం అయ్యారని రాజమౌళి చెప్పారు. పిల్లల్లో కలిగే 90 శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయనీ.. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతుందని చెప్పారు.

ఛాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లో చీఫ్ గెస్ట్ గా కపిల్ దేవ్ తో పాటు.. డాక్టర్ రవి తంగరాల కూడా పాల్గొన్నారు. డబ్బు సంపాందించేందుకు వెచ్చించే సమయంలో 5 శాతం పిల్లల కోసం కేటాయిస్తే ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని కపిల్ దేవ్ చెప్పారు. మీడియా పిల్లల కోసం పనిచేసే స్వచ్చంధ సంస్థలను ప్రొత్సహించాలని కోరారు. సెన్సెషన్ వార్తల కంటే పిల్లలపై ఇచ్చే వార్తలు సెన్సేషన్ అవుతాయని సలహా ఇచ్చారు కపిల్ దేవ్.