Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..

తెలుగు వాళ్ల పెద్ద పండగ సంక్రాంతి, సినిమాలకూ సంక్రాంతే పెద్ద సీజన్. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ముందే ప్లాన్ చేసుకుని, రంగంలోకి దిగుతారు మన స్టార్ హీరోలు. సంక్రాంతికి పోటీ పడి మరీ...................

Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..

Sankranthi Movies

Sankranthi Movies :  తెలుగు వాళ్ల పెద్ద పండగ సంక్రాంతి, సినిమాలకూ సంక్రాంతే పెద్ద సీజన్. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ముందే ప్లాన్ చేసుకుని, రంగంలోకి దిగుతారు మన స్టార్ హీరోలు. సంక్రాంతికి పోటీ పడి మరీ సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేస్తారు. 2022 సంక్రాంతి పెద్ద స్లార్లలందరూ ఊరించి, ఉడికించి కోవిడ్ దెబ్బకి సంక్రాంతికి రాలేమంటూ హ్యాండిచ్చారు. ఈ సారి అలాంటి పరిస్తితులు లేవు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోలంతా పోటీకి దిగుతున్నారు.

సంక్రాంతి వస్తుందంటేనే నెల రోజుల నుంచి ప్రిపేర్ గా ఉంటారు స్టార్ హీరోల ఫ్యాన్స్. తమ అభిమాన హీరో సినిమా యావరేజ్ ఉన్నా కూడా హిట్ చేస్తారు. అదే హిట్ టాక్ వస్తే రికార్డ్ లు బద్ధలు కొట్టాల్సిందే. అందుకే ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా కూడా సంక్రాంతి బరిలో తమ సినిమా ఉండాలని చూసుకుంటారు మన హీరోలు. లేటెస్ట్ గా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్టు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154వ సినిమాతో ఈ సంక్రాంతికే థియేటర్లోకి వస్తున్నట్టు అనౌన్స్ చేసి, మెగా అభిమానులను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. ఆచార్య నిరాశ పరిచినా బాబి డైరెక్షన్ లో మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు చిరూ.

Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..

తమిళ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న వారసుడు సినిమాని కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.

పొంగల్ పండక్కే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ఆదిపురుష్’ కూడా సందడి చేయబోతుంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా ఈ సినిమాని సంక్రాంతికే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు మేకర్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ డిలే అవుతుంది. అనుకున్న టైంకి షూట్ కంప్లీట్ అయితే పవన్ ని కూడా సంక్రాంతి బరిలోనే దింపడానికి చూస్తున్నారు డైరెక్టర్ క్రిష్.

మహేష్ కి బాగా కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి. దీంతో ఈ సారి కూడా సంక్రాంతికి మహేష్ రావాలనుకుంటున్నాడు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని సంక్రాంతికే బరిలోనే దించుతున్నట్టు సమాచారం. కానీ ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి అనుమానమే అంటున్నారు అభిమానులు.

ఇక ఉప్పెనతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యువ హీరో పంజా వైష్ణవ తేజ్ తన నాలుగో సినిమాని ఫుల్ మాస్ యాక్షన్ సినిమాగా త్రివిక్రమ్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని ఆల్రెడీ సంకాంతికి అనౌన్స్ కూడా చేసేశారు. ఇలా ఇప్పటికే దాదాపు అరడజను సినిమాలు సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నాయి. వీటికి మరిన్ని జత చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు.