Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. పుష్ప రాజ్ ఎక్కడ?

ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప 2 (Pushpa 2) అప్డేట్ వచ్చేసింది. పుష్ప ఎక్కడంటూ ఒక పవర్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. పుష్ప రాజ్ ఎక్కడ?

Sukumar Allu Arjun Pushpa 2 update is here

Pushpa 2 : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కలయికలో వచ్చిన సినిమా పుష్ప (Pushpa). 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరు ఊహించని విజయాన్ని అందుకొని రీజినల్ చిత్రం పై ఉన్న లెక్కలు అన్ని మార్చేసింది. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఏడాదిన్నర పూర్తి అయినా గాని ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!

సెకండ్ పార్ట్ అప్డేట్ కోసం ఆడియన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఇక వారందరి ఎదురు చూపులకు తెరపడింది. ఇక అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామంటూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈరోజు (ఏప్రిల్ 5) అదిరే అప్డేట్ ఇచ్చారు. ఒక పవర్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అంటూ మొదలయింది గ్లింప్స్. పుష్ప ఎక్కడ అంటూ మీడియా అండ్ పోలీస్ లో చూస్తుంటే, పుష్పని ఏమి చేశారంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్న విజువల్స్ గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తుంటే భన్వార్ సింగ్ షేఖావత్ (ఫహద్ ఫాసిల్) పుష్పని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 7 సాయంత్రం 4:05 నిమిషాలకు ఫుల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.