Pushpa : ఆ సీన్‌లో బన్నీని, ఫాహిద్ ఫాజిల్‌ని నగ్నంగా చూపిద్దాం అనుకున్నా : సుకుమార్

ఈ మూవీలో క్లైమాక్స్‌ సీన్‌ లో విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపిస్తారు. ఇద్దరూ డ్రెసెస్ తీసేసి అండర్ వేర్ లో కనిపించి పోటాపోటీగా డైలాగ్స్........

Pushpa : ఆ సీన్‌లో బన్నీని, ఫాహిద్ ఫాజిల్‌ని నగ్నంగా చూపిద్దాం అనుకున్నా : సుకుమార్

Pushpa

Pushpa :  అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన సినిమా ‘పుష్ప’. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘పుష్ప’ మొదట్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. బన్నీ మాస్‌ యాక్టింగ్‌ సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించారు. ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి పార్ట్ ని రిలీజ్ చేశారు. రెండో పార్ట్ లో అసలైన సినిమా ఉందని సుకుమార్ ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించడంతో ఇటీవల సుకుమార్ మీడియాతో మాట్లాడాడు. దీంతో సినిమా గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించాడు.

ఈ మూవీలో క్లైమాక్స్‌ సీన్‌ లో విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపిస్తారు. ఇద్దరూ డ్రెసెస్ తీసేసి అండర్ వేర్ లో కనిపించి పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ఈ సీన్ మాత్రం థియేటర్ లో అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. కొంతమంది ఈ సీన్ అనవసరంగా పెట్టారని, ఈ సీన్ తో ల్యాగ్ చేసారని కామెంట్లు చేశారు.

NTR-Ram Charan : మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోటీ ఉంది

తాజాగా ఈ క్లైమాక్స్‌ సీన్‌పై సుకుమార్‌ మాట్లాడుతూ.. ”పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌, షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నాను. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి ఆ తర్వాత సీన్ ని ఆలా మార్చనని” అన్నారు. ఇప్పటికే ఆ సీన్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే సుకుమార్ ఇలా చెప్పటంతో మరింత ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.