Suma Kanakala : అవును నాకు, రాజీవ్‌కి చాలా గొడవలు అయ్యాయి.. విడాకులు అనేవి..

గతంలో సుమ, రాజీవ్ మధ్య గొడవలు అయ్యాయని, వారు విడిపోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిపై సుమ కానీ , రాజీవ్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ ప్రోగ్రాంలో...........

Suma Kanakala : అవును నాకు, రాజీవ్‌కి చాలా గొడవలు అయ్యాయి.. విడాకులు అనేవి..

Suma

Suma Kanakala :  సుమ కనకాల.. యాంకర్ గా ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ, తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా చేరిపోయింది. మలయాళీ కుట్టి అయినా అచ్చతెలుగుతో అందర్నీ అలరిస్తుంది. టీవీ షోలతో, సినిమా ఈవెంట్స్ తో , యూట్యూబ్ ఛానల్ తో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంది. సుమ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా సుమ మెయిన్ లీడ్ గా మళ్ళీ సినిమా రాబోతుంది. సుమ మెయిన్ లీడ్ గా జయమ్మ పంచాయితీ సినిమా మే 6న విడుదల కానుంది. దీంతో ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. అన్ని ఛానల్స్ లో ప్రతి షోకి వెళ్లి తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

 

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా సుమ ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంకి వచ్చింది. ఇందులో సినిమా ప్రమోషన్ తో పాటు పలు పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఆలీ ఓ పర్సనల్ ప్రశ్న అడిగాడు సుమని. గతంలో సుమ, రాజీవ్ మధ్య గొడవలు అయ్యాయని, వారు విడిపోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిపై సుమ కానీ , రాజీవ్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ ప్రోగ్రాంలో ఆలీ దాని గురించి సుమని అడిగాడు.

Acharya : ‘ఆచార్య’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆలీ దాని గురించి ప్రస్తావిస్తూ నువ్వు రాజీవ్ విడిపోయారని, గతంలో రాజీవ్ ఒక ఇంట్లో, నువ్వు ఒక ఇంట్లో ఉన్నారని వార్తలు వచ్చాయి అవి ఎంతవరకు నిజం అని అడిగారు. సుమ దీనికి సమాధానమిస్తూ.. ”అవును, మా ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం వాస్తవమే. ఈ 23 ఏళ్లలో చాలా గొడవలు అయ్యాయి. భార్య భర్తలుగా విడాకులు తీసుకోవడం ఈజీనే, కానీ పేరెంట్స్ గా మాత్రం చాలా కష్టం” అని తెలిపింది. అయితే ప్రోమోలో దీనికి కొంచెమే చూపించినట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. మొత్తానికి సుమ తనకి, తన భర్త రాజీవ్ కి మధ్య ఉన్న గొడవల గురించి ఓపెన్ అయినట్టు తెలుస్తుంది. సుమ చెప్పిన దాని ప్రకారం వీరికి గొడవలు అయినట్టు, విడాకుల వరకు వెళ్లినట్టు, కానీ పిల్లల కోసం కలిసి ఉండాలని అర్ధం చేసుకొని కలిసిపోయినట్టు తెలుస్తుంది.