Sumanth : చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకి హీరో సుమంత్, సుప్రియ

ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో హీరో సుమంత్‌, నిర్మాత సుప్రియలు మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. గతంలో సుమంత్ హీరోగా బాలీవుడ్ సినిమా విక్కీ డోనార్ ని తెలుగులో 'నరుడా.. డోనరుడా'.......

Sumanth : చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకి హీరో సుమంత్, సుప్రియ

Sumanth

Sumanth :  నిన్న ఓ చెక్‌ బౌన్స్‌ కేసులో హీరో సుమంత్‌, నిర్మాత సుప్రియలు మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. గతంలో సుమంత్ హీరోగా బాలీవుడ్ సినిమా విక్కీ డోనార్ ని తెలుగులో ‘నరుడా.. డోనరుడా’ సినిమాగా రీమేక్ చేశారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మించింది. ఈ సినిమాకు మార్కాపురంకి చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫైనాన్స్‌ అందించారు. ఆ తర్వాత నిర్మాతలు తనకిచ్చిన చెక్‌ బౌన్స్‌ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్‌ కారుమంచి శ్రీనివాసరావు కేసు వేశారు. అప్పటి నుంచి ఈ కేసు వాయిదాల మీద నడుస్తుంది. కరోనా వల్ల ఈ కేసుకు చాలా గ్యాప్ వచ్చింది.

Oorvashi Rautela : ఒకప్పుడు కంటెస్టెంస్ట్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ జడ్జి.. రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి

తాజాగా మరోసారి ఈ కేసు వాయిదాకు రావడంతో ఈ సినిమా హీరో సుమంత్‌, నిర్మాత సుప్రియ నిన్న మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. అయితే తీర్పు ఏం వెలువడింది అనేది తెలియదు. ఇక హీరో సుమంత్ మార్కాపురం రావడంతో కొంతంది సుమంత్ తో ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు.