Mem Famous Collections : మేమ్ ఫేమస్ కలెక్షన్ల జోరు.. మొదటిరోజే ఏకంగా..

సుమంత్ ప్రభాస్ నటిస్తూ డైరెక్ట్ చేసిన మేమ్ ఫేమస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే ఈ మూవీ..

Mem Famous Collections : మేమ్ ఫేమస్ కలెక్షన్ల జోరు.. మొదటిరోజే ఏకంగా..

Sumanth Prabhas Mem Famous movie first day Collections

Mem Famous : టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ మేకర్స్ సంచలనాలు సృష్టిస్తున్నారు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. షార్ట్ ఫిలిమ్స్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న ‘సుమంత్ ప్రభాస్’ అనే యంగ్ అండ్ టాలెంటెడ్ కుర్రాడు.. రైటర్‌గా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ మేమ్ ఫేమస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా నిన్న (మే 26) ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Tovino Thomas : రాజమౌళి ప్రతి ఫిలిం మేకర్‌కి స్ఫూర్తి.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్!

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా అదరహో అనిపిస్తుంది. మొదటిరోజే ఈ సినిమా 1.1 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ మూవీ టోటల్ బడ్జెట్ 2 కోట్ల లోపే, ఫస్ట్ డేనే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో.. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేలోపు టోటల్ బడ్జెట్ ని రికవరీ చేసేస్తుంది అంటున్నారు. మరి చూడాలి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో.

Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్‌ టార్గెట్!

కాగా ఈ సినిమాని ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించిన లహరి ఫిలింస్ ప్రొడక్షన్స్.. చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తెలంగాణ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలో మని ఎగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, కిరణ్ మచ్చా, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు.