Bigg Boss 5 : డ్యాన్సులతో అదరగొట్టిన కంటెస్టెంట్స్.. కూల్ అయిన నాగార్జున

నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా సీరియస్ గా సాగింది. నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపైనా సీరియస్ అయ్యాడు. శ్వేతా వర్మ ఎలిమినేట్ అయిపొయింది. లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

Bigg Boss 5 : డ్యాన్సులతో అదరగొట్టిన కంటెస్టెంట్స్.. కూల్ అయిన నాగార్జున

Bb5

Bigg Boss 5 :  నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా సీరియస్ గా సాగింది. నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపైనా సీరియస్ అయ్యాడు. శ్వేతా వర్మ ఎలిమినేట్ అయిపొయింది. లోబో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ అంతా సీరియస్ గా సాగిపోయింది. ఇవాళ ఆదివారం కావడంతో సీరియస్ ని పక్కన పెట్టి ఫన్ ఇస్తాను అని నాగార్జున చెప్పాడు.

ఇవాళ నైట్ రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఎప్పటిలాగే వీకెండ్ ఎపిసోడ్ అంటే డ్యాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ తో డ్యాన్సులు చేపించాడు. కంటెస్టెంట్స్ అంతా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత విజిల్ ఊదితే ఆ సౌండ్ ని బట్టి పాటల్ని కనిపెట్టే గేమ్ పెట్టారు. సభ్యులంతా దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు. ఆ తర్వాత కళ్ళకి గంతలు కట్టి ఒక గేమ్ ఆడించారు.

Navyaswamy : ఈ సీరియల్ హీరోయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే…

ఇక మీరు చేసేవి, మాట్లాడేవి అన్నీ నాకు తెలిసిపోతాయి అని సిరి, రవిలకి కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. అయితే రవి మీకు తెలిసిపోతున్నాయా ఇకనుంచి జాగ్రత్తగా ఉంటాము అని నవ్వుతు అన్నాడు. నాగార్జున కూడా ఇప్పటికైనా తెలుసుకున్నావు అన్నారు. ఆ తర్వాత సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబోని పలకరించారు. లోబో ఇంకా ఇక్కడే ఉండాలా సర్ అని అడగడంతో ప్రోమో ముగిసింది. ఇవాళ కంటెస్టెంట్స్ ఆట పాటలతో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.