Sunny Leone : పెళ్లి టైంలో చేతిలో డబ్బులు లేవు.. గెస్టులు ఇచ్చిన గిఫ్టులతో రిసెప్షన్ బిల్లులు కట్టాం..

సన్నీ తన భర్త డానియల్ వెబర్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ''ఇవాళ్టితో నాకు పెళ్లయి 11 సంవత్సరాలు. మాకు పెళ్లి జరిగిన సమయంలో చేతిలో డబ్బులు కూడా లేవు. 50 మంది కంటే తక్కువమంది..........

Sunny Leone : పెళ్లి టైంలో చేతిలో డబ్బులు లేవు.. గెస్టులు ఇచ్చిన గిఫ్టులతో రిసెప్షన్ బిల్లులు కట్టాం..

Sunny

 

Sunny Leone :  ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఆ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు, ఐటెం సాంగ్స్ తో బిజీబిజీగా ఉంది సన్నీ. బాలీవుడ్ లోనే కాక వేరే భాషల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది సన్నీ. సినిమాల పరంగా సన్నీని పక్కన పెడితే పర్సనల్ గా చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, పిల్లలని దత్తత తీసుకొని, కొంతమంది పిల్లలని తన డబ్బులతో చదివిస్తుంది సన్నీ లియోన్. ఈ విషయంలో సన్నీని అందరూ మెచ్చుకుంటారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే సన్నీ లియోన్ తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ పోస్టులు చేసింది. సన్నీ తన భర్త డానియల్ వెబర్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”ఇవాళ్టితో నాకు పెళ్లయి 11 సంవత్సరాలు. మాకు పెళ్లి జరిగిన సమయంలో చేతిలో డబ్బులు కూడా లేవు. 50 మంది కంటే తక్కువమంది సమక్షంలోనే మా వివాహం జరిగింది. పెళ్ళికి వచ్చిన వాళ్లు మా చేతిలో పెట్టిన ఎన్విలాప్‌ కవర్లు పెళ్లి తంతు అయిపోగానే ఓపెన్ చేసి అందులో వచ్చిన వాటితో రిసెప్షన్‌ బిల్స్ కట్టాము. ఆ సమయంలో కొంతమంది తాగిన మత్తులో చాలా తప్పుగా మాట్లాడారు. కానీ మేము అవేం పట్టించుకోలేదు.”

Kirak RP : కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా?.. స్టార్ సెలబ్రిటీలను మించి..

”ఇప్పటికే మేం ఇద్దరం కలిసి ఎంతో దూరం ప్రయాణించాము. కేవలం ప్రేమతోనే అది సాధ్యమైంది. మా పెళ్లి స్టోరీ అంటే నాకెంతో ఇష్టం. మేము చాలా దూరం ప్రయాణం చేశాం. హ్యాపీ యానివర్సరీ బేబీ” అంటూ పోస్ట్ చేసి తన భర్త డానియల్ వెబర్ ని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం సన్నీ తన భర్త పిల్లలతో చాలా హ్యాపీగా ఉంది.