Supreme Court : ప్రేమ వివాహం చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టు తెలిపారు.

Supreme Court : ప్రేమ వివాహం చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court (5)

Love Marriages Divorces : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమ వివాహం చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారని పేర్కొంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటల్లోనే ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయి, సంజయ్ కారల్ తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది.

వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి స్పందిస్తూ ఎక్కువ శాతం డైవర్స్ కేసులన్నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నవారి నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.

Supreme Court : కుమారి, శ్రీమతి అంటే తప్పేంటి? – సుప్రీంకోర్టు

అయితే, ఆ కేసులో మధ్యవర్తితత్వాన్ని కోర్టు సూచించింది. కానీ, దాన్ని భర్త వ్యతిరేకించారు. ఇలాంటి సందర్భంలో ఇటీవల వచ్చిన ఓ తీర్పును ఆధారంగా చేసుకుని, భర్త ఆమోదం లేకుండానే ఆ జంటకు విడాకులు ఇవ్వొచ్చని పేర్కొంది. కానీ, మధ్యవర్తిత్వం తప్పనిసరని సుప్రీంకోర్టు తెలిపింది.