Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..

వెళ్ళిపో అనే మ్యూజికల్ వీడియోకి సంభందించిన పోస్టర్ ని పోస్ట్ చేసి.. ''ఇది మ్యాటర్. నేను ఎస్ చెప్పింది ఈ సాంగ్ లో నటించడానికి'' అని పోస్ట్ చేసింది. నటుడు, ర్యాపర్ రాకీ జోర్దాన్.....

Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..

Vellipo

Supritha :  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు తాజాగా సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ అంటూ తనకి ఓకే చెప్పను అంటూ ఓ అబ్బాయితో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయి తన బాయ్ ఫ్రెండ్ అని పరిచయం అయింది. అయితే ఇదంతా ఓ సాంగ్ కోసం ప్రమోషన్ అని పోస్ట్ చేసి షాకిచ్చింది సుప్రీత. అయితే తాను ప్రమోషన్ కోసం పెట్టిన పోస్ట్ ఇలా రాంగ్ వే లో వెళ్లడంతో ఏకంగా ఆ పోస్ట్ నే డిలీట్ చేసింది సుప్రీత.

 

వెళ్ళిపో అనే మ్యూజికల్ వీడియోకి సంభందించిన పోస్టర్ ని పోస్ట్ చేసి.. ”ఇది మ్యాటర్. నేను ఎస్ చెప్పింది ఈ సాంగ్ లో నటించడానికి” అని పోస్ట్ చేసింది. నటుడు, ర్యాపర్ రాకీ జోర్దాన్ తో కలిసి ‘వెళ్ళిపో’ అనే ప్రైవేట్ సాంగ్ లో సుప్రీత నటిస్తుంది. త్వరలోనే ఈ పాట రిలీజ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో రాకీ సుప్రీతకి వెనకాల నుంచి గిటార్ పట్టుకొని నేర్పిస్తున్నట్టు ఉంది.

Balakrishna : ‘అఖండ’ సినిమాని చూడండి.. బాలకృష్ణని కలిసే ఛాన్స్ కొట్టేయండి..

ఇక ఈ పోస్ట్ పెట్టడంతో పాటు ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన సుప్రియ.. ”అదంతా మ్యూజికల్ వీడియో ప్రమోషన్ కోసం చేశాను. నేను సింగిల్. ఎవ్వరితోనూ ప్రేమలో లేను. చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. అయినా నేను ఏంటో మా అమ్మకి తెలుసు. నా చుట్టూ ఉన్న వాళ్లకి తెలుసు. నా వాళ్లందరికీ తెలుసు. నేను అందరికీ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు” అని సీరియస్ అయింది సుప్రిత.

Samantha : మంచులో దూసుకెళ్తూ.. స్విట్జర్లాండ్‌లో సమంత స్కైయింగ్..

అలా పోస్ట్ చేయడం ఎందుకు ఇలా సీరియస్ అవ్వడం ఎందుకు? మీరు ఆలా పోస్ట్ చేసారు కాబట్టే జనాలు ఆలా ప్రమోట్ చేశారు అని నెటిజన్లు సుప్రీతపై ఫైర్ అవుతున్నారు. గతంలో పునర్నవి కూడా ఇలాగే తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కి అందులో హీరోతో ఎంగేజ్మెంట్ అయినట్టు ప్రకటించింది. ఆ తర్వాత అదంతా ప్రమోషన్ కోసమే అని చెప్పింది. ఇప్పుడు సుప్రీత కూడా ఇలాగే చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.