Surekhavani : సురేఖవాణి బర్త్‌డే సెలబ్రేషన్స్.. బ్యాంకాక్‌లో తాగుతూ రచ్చ చేసిన తల్లి కూతుళ్లు..

తాజాగా సురేఖవాణి పుట్టిన రోజు ఉండటంతో ఈ తల్లి కూతుళ్లు ఇద్దరూ బ్యాంకాక్‌కి చెక్కేశారు. బ్యాంకాక్‌లో రాత్రి పూట తమ హోటల్ రూమ్ బాల్కనీలో కేక్ కటింగ్ చేసి.................

Surekhavani : సురేఖవాణి బర్త్‌డే సెలబ్రేషన్స్.. బ్యాంకాక్‌లో తాగుతూ రచ్చ చేసిన తల్లి కూతుళ్లు..

Surekha

Surekhavani :   ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, రీల్స్, డ్యాన్సులు పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తారు. సోషల్ మీడియాలో వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సురేఖవాణి ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క కూతురితో కలిసి ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎంజాయిమెంట్ అంతా సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు తల్లి కూతుళ్లు.

 

ఇటీవల గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. తాజాగా సురేఖవాణి పుట్టిన రోజు ఉండటంతో ఈ తల్లి కూతుళ్లు ఇద్దరూ బ్యాంకాక్‌కి చెక్కేశారు. బ్యాంకాక్ కి వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో మందు తాగిన ఓ వీడియోని, బ్యాంకాక్ కి వెళ్లి మసాజ్ చేపించుకుంటున్న ఫోటోని సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక సురేఖవాణి బర్త్ డే సెలబ్రేషన్స్ ని తాజాగా ఇద్దరు తమ సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు. ఇద్దరూ పొట్టి గౌన్లు వేసుకొని మందు తాగుతూ, కేక్‌ని చూపిస్తూ ఉన్న వీడియోల్ని పోస్ట్ చేశారు.

Gopichand : షూటింగ్‌లో హీరో గోపీచంద్‌కి ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..

బ్యాంకాక్‌లో రాత్రి పూట తమ హోటల్ రూమ్ బాల్కనీలో కేక్ కటింగ్ చేసి మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. కూతురు సుప్రీత తన తల్లి సురేఖకు దగ్గరుండి తాగించడం విశేషం. ఇక సురేఖవాణి బర్త్ డే సెలబ్రేషన్స్‌కి వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సురేఖవాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.