Kanguva : కేరళలో సూర్య కంగువ షూటింగ్.. షూటింగ్ ఎంత పూర్తి అయ్యిందో తెలుసా?

తమిళ హీరో సూర్య నటిస్తున్న 'కంగువ' కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ పార్ట్..

Kanguva : కేరళలో సూర్య కంగువ షూటింగ్.. షూటింగ్ ఎంత పూర్తి అయ్యిందో తెలుసా?

Suriya Disha Patani Kanguva new schedule starts at kerala

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న 42వ చిత్రం ‘కంగువ’. తమిళ మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. సూర్య కెరీర్ లో మొదటిసారి వారియర్ రోల్ ప్లే చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. ఇక ఈ మూవీ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ఇటీవల టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

Kanguva : కోలీవుడ్ సత్తా ‘కంగువ’తో చూపించేందుకు సిద్దమైన సూర్య..

టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే.. రాబిన్ హుడ్ తరహాలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా న్యూ షెడ్యూల్ ని అనౌన్స్ చేసింది. ఈ షెడ్యూల్ షూటింగ్ ని కేరళలో ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో సూర్య అండ్ దిశా పటాని పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి లోపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది మొదటి భాగంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులు గురించి తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గ్లింప్స్ అండ్ మోషన్ పోస్టర్ కి దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంది. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రంతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ సినిమా పై మరింత ఆసక్తిని రేపుతోంది.