Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..

సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదలైంది. ఇందులో సూర్య మత్స్యకారుడిగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం భారీ వ్యయంతో మత్స్యకారుల గుడిసెల....

Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..

Surya

Suriya :  తమిళ్ స్టార్ హీరో సూర్య ఒకపక్క కమర్షియల్ సినిమాలతో, మరో పక్క మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక సూర్య తన భార్య జ్యోతిక కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి చదువు చెప్పిస్తున్నారు, మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కరోనా కాలంలో కూడా వీరిద్దరూ చాలా మందికి సహాయం చేసి తమ మంచి మనుసుని చాటుకున్నారు. తాజాగా మరోసారి సూర్య తన గొప్ప మానుని చాటుకున్నాడు.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ లో వైల్డ్ కార్డు ఎంట్రీ??

 

సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదలైంది. ఇందులో సూర్య మత్స్యకారుడిగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం భారీ వ్యయంతో మత్స్యకారుల గుడిసెల సెట్‌లను నిర్మించాలి. తమిళనాడు కన్యాకుమారిలో ఈ చిత్రీకరణ జరగనుంది. అయితే సాధారణంగా షూటింగ్ కోసం అంటే కేవలం ఒక్కసారికి పనికొచ్చేలా ఆ సెట్స్ ని నిర్మిస్తారు. అయితే ఈ సినిమాకి మాత్రం అక్కడి మత్స్యకారుల గుడిసెలను సెట్స్ లా కాకుండా నాణ్యతతో ఎప్పటికి పనికొచ్చేలా నిర్మిస్తున్నారట. షూటింగ్ అయిపోయిన తర్వాత వీటిని అక్కడి జాలర్లకి ఇవ్వాలని సూర్య భావించారు. ఇందుకోసం ఈ సినిమాకి నిర్మాత కూడా సూర్యనే కావడంతో షూటింగ్‌ నిమిత్తమే అయినా చక్కటి నాణ్యతతో నివాసయోగ్యంగా ఈ గుడిసెలను కట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి జాలర్లకి ఇవ్వనున్నారు. దీంతో సూర్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి ప్రజలతో పాటు అంతా అభినందిస్తున్నారు.