Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హీరో సూర్య ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. సూర్య తన ట్వీట్ లో.. ''ప్రియమైన కమల్‌హాసన్‌ అన్నా మీతో స్క్రీన్ పంచుకోవాలన్న కల...............

Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

Kamal Suriya

Kamalhaasan :  కమల్‌హాసన్‌ మెయిన్ లీడ్ లో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్రల్లో, సూర్య అతిథి పాత్రలో ఇంతమంది స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. జూన్‌ 3న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హీరో సూర్య ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. సూర్య తన ట్వీట్ లో.. ”ప్రియమైన కమల్‌హాసన్‌ అన్నా మీతో స్క్రీన్ పంచుకోవాలన్న కల నాకు నెరవేరింది. దీన్ని జరిగేలా చూసిన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌కు ధన్యవాదాలు. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు” అని తెలిపాడు.

Raviteja: మాస్ రాజా మూవీలో జాతిరత్నాలు పాప.. ఏం చేస్తుందంటే?

దీనికి కమల్ హాసన్ కూడా సమాధానమిస్తూ.. ”డియర్‌ సూర్య తంబి మనం కలిసి సినిమా చేయాలన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది నీకు కూడా తెలుసు. నీ దగ్గర అపారమైన మంచి ప్రేమ ఉంది. ఇప్పుడు మరింత అభిమానగణం పెరిగింది. ఆల్‌ ది బెస్ట్‌ తంబి. సారీ.. తంబి సర్‌..’’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. ఇలా సూర్య కమల్ ని అన్నా అని పిలవడం, కమల్ సూర్యని తంబీ అని పిలుస్తూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. అభిమానులు కూడా ఈ ట్వీట్స్ చూసి ఎంతో ఆనందిస్తున్నారు.