Taapsee Pannu: పెద్ద స్టార్ కుటుంబంలో పుడితే.. ఆర్యన్ అరెస్ట్‌పై తాప్సీ

స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌పై స్పందించారు.

Taapsee Pannu: పెద్ద స్టార్ కుటుంబంలో పుడితే.. ఆర్యన్ అరెస్ట్‌పై తాప్సీ

Thapsee

Taapsee Pannu: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ని ముంబయి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించగా.. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ విషయమై బాలీవుడ్ మొత్తం చర్చిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఈ విషయమై స్పందించారు.

సమాజంలో ఇన్‌ఫ్లుయన్స్ ఉన్న కుటుంబం నుంచి వస్తే, ఏ చిన్న తప్పు చేసినా పెద్దగా కనిపిస్తాం అని చెప్పారు. కుటుంబం కూడా ఇళ్లలో ఉన్నవారు యువత ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చూసుకుంటూ ఉన్నారని అన్నారు. ఒక పెద్ద కుటుంబంలో భాగమైతే, బ్యాగేజీ వెనుకనే వస్తుందని, పబ్లిక్ ఫిగర్‌లో భాగమైనప్పుడు నచ్చినా నచ్చకపోయినా జాగ్రత్తగా ఉండాలని తాప్సీ అభిప్రాయపడ్డారు.

స్టార్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ప్రతికూలతలు ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేశారా? లేదా? అనే విషయాన్ని అప్పుడే నిర్ధారించలేమని, చట్టపరిధిలో విషయాలు ఎలా ఉంటాయో అతనికి తెలుసునని ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారి చట్టపరమైన ప్రక్రియలో సిద్ధమైనంత వరకు, వారు దాని ద్వారా వెళ్ళాలని అన్నారు.