Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ

మెగాస్టార్ చిరంజీవితో రెండోసారి కలిసి నటించబోతోంది మిల్కీబ్యూటీ తమన్నా..

Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ

Tamannaah

Bholaa Shankar: మెగస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న క్రేజీ ఫిలిం.. తమిళ్‌లో ‘తల’ అజిత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Acharya : మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..

తెలుగు నేటివిటీ, మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టు మెహర్ రమేష్ కథలో మార్పులు చేర్పులు చేశారు. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. చిరు పక్కన హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నాను ఫిక్స్ చేశారు. ‘సైరా’ లో చిరుతో కలిసి తొలిసారి నటించింది తమన్నా.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

ఆ క్యారెక్టర్ నిడివి తక్కవగా ఉంటుంది. పైగా హిస్టారికల్ ఫిలిం కాబట్టి తమన్నాతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దొరకలేదని చిరు ఇంతకుముందు చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడాయన తమన్నాతో డ్యాన్స్ చెయ్యాలనే ముచ్చట తీర్చుకోబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి ‘భోళా శంకర్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!