Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ పోస్టర్స్‌తో పాటు ఈ సినిమాలో ముఖ్య క్యాస్టింగ్‌కు సంబంధించి వరుసగా పోస్టర్స్‌ను రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్.

Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

Tamannaah In Rajinikanth Jailer Movie

Jailer Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ పోస్టర్స్‌తో పాటు ఈ సినిమాలో ముఖ్య క్యాస్టింగ్‌కు సంబంధించి వరుసగా పోస్టర్స్‌ను రివీల్ చేస్తోంది చిత్ర యూనిట్.

Jailer Movie: జైలర్ మూవీలో జాయిన్ అయిన మంగళం శ్రీను!

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఆ తరువాత తెలుగు కమెడియన్ యాక్టర్ సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ రీసెంట్‌గా వెల్లడించింది. ఇక ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను నుండి ఓ స్టార్ హీరోయిన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Jailer : రజినీకాంత్ సినిమాలో మోహన్ లాల్ గెస్ట్ అపియరెన్స్..

మిల్కీ బ్యూటీ తమన్నా జైలర్ మూవీలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. ఇక మరికొంత మంది స్టార్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌ను కూడా ఇదే విధంగా రివీల్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా జైలర్ మూవీపై అంచనాలను రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.