Varisu: వారసుడి కోసం సీఎం రాక.. విజయ్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

Varisu: వారసుడి కోసం సీఎం రాక.. విజయ్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే!

Tamil Nadu CM Stalin To Come For Varisu Audio Launch

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

ఈ సినిమా ఆడియో లాంచ్‌ను శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకానున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సీఎం స్టాలిన్‌ను ప్రత్యేకింగా ఈ ఈవెంట్‌కు రావాల్సిందిగా కోరారట.

ఒకవేళ నిజంగానే ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు సీఎం స్టాలిన్ హాజరైతే, వారిసు మూవీకి అదిరిపోయే క్రేజ్ రావడం ఖాయం. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.