RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు తమ్మారెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ సినిమాలు, బడ్జెట్ గురించి టాపిక్ రావడంతో మొదట.. బాహుబలి 200 కోట్లు పెట్టి తీశారు. సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ఒకవేళ పోతే రాజమౌళిని అందరూ పిచ్చోడు అనుకునేవాళ్లు. లోకల్ సినిమాకి...............

RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Tammareddy Bharadwaja Sensational comments on RRR unit Oscars promotions

RRR :  మన RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కూడా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో RRR సినిమా పేరుప్రఖ్యాతలు, అవార్డులు, కలెక్షన్స్ గత సంవత్సర కాలంగా సాధిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో RRR యూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది. రాజమౌళి అయితే గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, ఎన్టీఆర్ మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలోనే ఉంది సినిమాని ప్రమోట్ చేస్తూ, వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే కొంతమంది మాత్రం ఇంకా మన సినిమా మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. నెటిజన్లు, లేదా ఎవరైనా ఆడియన్స్ అన్నారంటే వాళ్ళకి సరిగ్గా తెలియక అన్నారు అనుకోవచ్చు, కానీ కొంతమంది సినీ ప్రముఖులే RRR పై విమర్శలు చేస్తున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికులు వారిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR సినిమా యూనిట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు తమ్మారెడ్డి. ఈ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ సినిమాలు, బడ్జెట్ గురించి టాపిక్ రావడంతో మొదట.. బాహుబలి 200 కోట్లు పెట్టి తీశారు. సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ఒకవేళ పోతే రాజమౌళిని అందరూ పిచ్చోడు అనుకునేవాళ్లు. లోకల్ సినిమాకి 200 కోట్లు పెట్టి ఎవరైనా సినిమాలు తీస్తారా అని అప్పట్లో అందరు అనుకున్నారు. అది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు భారీ సినిమాలు వస్తున్నాయి అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో.. ఇప్పుడు RRR టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా అభిమానులు, పలువురు నెటిజన్లు తమ్మరెడ్డిని విమర్శిస్తున్నారు.

Hotstar : ఐపీఎల్ పోయింది.. ఇప్పుడు HBO కూడా.. ఇండియాలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ పని అయిపోయిందా?

ఎంత ఖర్చుపెట్టినా అది ఇండియన్ సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది, మన మార్కెట్ పెరుగుతుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ సినిమా అయింది. ఒకవేళ ఆస్కార్ వస్తే చరిత్ర సృష్టించినవాళ్ళం అవుతాం, అయినా నీ డబ్బు కాదుగా ఖర్చుపెట్టేది.. ఇవేం తెలీకుండానే కామెంట్స్ చేస్తున్నారు అంటూ తమ్మరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.