Zelensky: యుక్రెయిన్ ప్రెసిడెంట్ పేరుతో అస్సాంలో టీ పొడి, కారణమిదే..

అస్సాం స్టార్టప్ కంపెనీ ఓ సీటీసీ టీను ప్రారంభించింది. దానికి రష్యాను శౌర్యంతో, ధైర్యంతో అడ్డుకుంటున్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పేరు పెట్టి గౌరవించింది. అస్సాం సీటీసీ టీ..

Zelensky: యుక్రెయిన్ ప్రెసిడెంట్ పేరుతో అస్సాంలో టీ పొడి, కారణమిదే..

Zelensky

Zelensky: అస్సాం స్టార్టప్ కంపెనీ ఓ సీటీసీ టీను ప్రారంభించింది. దానికి రష్యాను శౌర్యంతో, ధైర్యంతో అడ్డుకుంటున్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పేరు పెట్టి గౌరవించింది. అస్సాం సీటీసీ టీ బ్రాండ్ Zelensky పేరుతో బుధవారమే లాంచ్ చేశామని ఆరోమాటిక్ టీ డైరక్టర్ రంజిత్ బారువా మీడియాతో అన్నారు.

‘యుద్ధంలో నష్టపోతున్నా యుక్రెయిన్ నుంచి తప్పించుకోవడానికి అమెరికా అవకాశం కల్పించినా.. తిరస్కరించి రష్యాపై పోరాడేందుకు నిలిచిన ప్రెసిడెంట్ ని గౌరవించడమే ప్రధానంగా భావిస్తున్నాం. తనకు కావాల్సింది ఆయుధాలు కానీ, రైడ్ కాదని తేల్చేశాడు. అదే అతని క్యారక్టర్ ను తెలియజేస్తుంది’ అని బారువా ప్రశంసలు కురిపించాడు.

విజయం దగ్గర్లో లేదని తెలుసు. అయినా పోరాడుతున్నాం అని ఓ యుక్రెయినియన్ స్టూడెంట్ అన్నారు.

Read Also : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కామెడీ సిరీస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో మళ్లీ వస్తోంది..!

‘అతని వ్యక్తిత్వాన్ని మా టీ పౌండర్ తో పోల్చుతూ క్వాలిటీని ప్రతిబింబించేలా చేస్తున్నాం. ఈ టీ పొడి ఆన్ లైన్ లోనూ అమ్మకానికి దొరుకుతుంది’ అని వ్యాఖ్యానించారాయన.