HanuMan : ఇండియన్ సూపర్ హీరో వచ్చేస్తున్నాడు.. హనుమాన్ షూటింగ్ పూర్తి..

తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో వస్తున్న సూపర్ హీరో సినిమా హనుమాన్. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

HanuMan : ఇండియన్ సూపర్ హీరో వచ్చేస్తున్నాడు.. హనుమాన్ షూటింగ్ పూర్తి..

Teja Sajja Prasanth Varma HanuMan movie shooting completed

HanuMan : టాలీవుడ్ లో మొదటి సారి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ వస్తున్న చిత్రం హనుమాన్. యువ హీరో తేజ సజ్జ (Teja Sajja), దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కలయికలో వస్తున్న ఈ చిత్రంలో లార్డ్ హనుమంతుడు ని ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్ తరువాత ఇండియా మొత్తం ఎదురు చూసేలా చేసి పాన్ ఇండియా యాంటిసిపేటెడ్ మూవీ అయ్యిపోయింది. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Hanuman : హనుమాన్ సినిమాకి వీఎఫ్ఎక్స్ చేసింది హాలీవుడ్ లో కాదు.. హైదరాబాద్ లోనే ఏ కంపెనీనో తెలుసా??

ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్లు వెల్లడిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ప్రమోషన్ వర్క్స్ లో వేగం పెంచనున్నారు. ఇటీవలే సినిమాలోని హనుమాన్ చాలీసాని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకం పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Ravanasura: ఓటీటీలో ల్యాండింగ్‌కు రెడీ అయిన రావణాసుర.. ఎప్పుడంటే?

ఇక ఈ మూవీ శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో మే 12న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రంగా తెరకెక్కుతుంది. భారతీయ ఇతిహాసంలో ఉన్న దేవుడలను సూపర్ హీరోలుగా మారుస్తూ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఉండబోతుంది. హనుమాన్ తరువాత ‘అదిరా’ (Adhira) అనే చిత్రం ఉండబోతుంది. ఈ మూవీలో దేవతల రాజు అయిన ‘ఇంద్రుడు’ని సూపర్ హీరోగా చూపించబోతున్నారు.