Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు

ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు

Weather

Rains in Telangana: ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆదివారం నాడు తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also read: Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్

ఇక రాష్ట్రంలో శుక్రవారం నాడు అత్యల్పంగా నిర్మల్ జిల్లా తానూర్ లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. మరో 20 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఉదయం, రాత్రివేళలో చలి తీవ్రత ఉంది. ఉదయం పది దాటినా ఎండ తగలడం లేదు. చలి తీవ్రతకు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.

Also read: Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌..