Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. ఇంతకు ముందు నేషనల్ ఓటీటీలు ఎన్నింటినో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు తొలి మాతృబాష ఓటీటీ ఆహాను ఊహించని స్థాయిలో ఆదరించారు. సిరీస్ ల నుండి షోల వరకు..

Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

Aha

Aha OTT: అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. ఇంతకు ముందు నేషనల్ ఓటీటీలు ఎన్నింటినో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు తొలి మాతృబాష ఓటీటీ ఆహాను ఊహించని స్థాయిలో ఆదరించారు. సిరీస్ ల నుండి షోల వరకు.. ఒరిజినల్స్ నుండి మూవీస్ వరకు అన్నిటిలో ఆహా అనిపించింది. ఇకపై కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని అందించేందుకు ఆహా యాజమాన్యం సంపూర్ణ సిద్ధంగా ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆహా ఇప్పుడు ఇతర సౌత్ అన్ని బాషలలో విస్తరించేందుకు సిద్ధమైంది.

Salman Khan: సూపర్ స్టార్స్‌నే వెయిట్ చేయిస్తున్న భాయిజాన్!

ఇకపై ఆహాను తమిళంలో కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా ద్వారా తమిళంలో ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ తో ప్రమోషన్ చేయించి ఆహాకు మరింత క్రేజ్ వచ్చేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు బేస్ తో ప్రారంభమైన ఓటీటీ ఆహా ఇతర బాషా చిత్రాలను ఇక్కడ డబ్ చేసి ప్రసారం చేస్తోంది. ఇలా ఈ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఆహా ఇకపై తమిళ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనునట్లు సమాచారం.

Special Songs: రేంజ్ పెరిగిన ఐటెం సాంగ్స్.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ లో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల ఎంపిక విషయంలో నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటి వరకు కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే ఉన్న అల్లు అరవింద్ మొట్టమొదటిసారి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అహాతో డిజిటల్ రంగప్రవేశం చేసి మెల్ల మెల్లగా దాన్ని మెగా హిట్ చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాతోనే తమిళంలో కూడా తక్కువ బడ్జెట్ తో సినిమాలు.. షోలతో పక్కా ప్లాన్ ప్రకారమే ఆహా తమిళం మొదలు పెట్టనున్నారట.

BBB: బాలయ్య-బోయపాటి-బన్నీ మల్టీస్టారర్.. రచ్చ రచ్చేనా?

ఆహాలో మొదటి తమిళ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ కు కూడా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఈనెల 28వ తేదీన ఆహా తమిళ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తుండగా.. అందుకోసం శరత్ కుమార్ నటించిన ఇరై వెబ్ సిరీస్, ఆకాశ్ వాణిని రెండిటిలో ఒకటి తమిళంలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తమిళ ఆహాకు సంబంధించి దర్శకుడు వంశీ పైడిపల్లి అద్వర్యంలో ఓ టీమ్ పనిచేస్తుండగా.. తమిళంలో కూడా అల్లు అర్జున్ తో పాటు మరో స్టార్ హీరోతో కూడా ప్రమోట్ చేయిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.