Medaram Jatara : మేడారం జాతరకు రూ.2.5 కోట్ల నిధులు ప్రకటించిన కేంద్రం

తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది.

Medaram jatara : మేడారం జాతరకు రూ.2.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ, పర్యా టక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన సాంస్కృతిక, వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను వివరించారు. గిరిజన ప్రజల ప్రత్యే కసంస్కృతి, వారసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని మంత్రి తెలిపారు.

ఈ నిధులను మేడారంలోని చిలకల గుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మించటానికి, దానికి అనుసంధానంగా 900 మీటర్ల మెష్ ను ఏర్పా టుకు, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అధ్భుతమైన చిత్రాలను వేయటానికి, గిరిజన మ్యూజియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పా టు, గిరిజన మ్యూజియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టడానికి వినియోగిస్తామన్నారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Tirumala : శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుండి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు

ఐలాపూర్ సమ్మక్క జాతర, చిరుమల్ల సమ్మక్క జాతర, సాదలమ్మ తిరుణాల వంటి అనేక పండుగలు, వాటి విశిష్టత మీద పరిశోధనలు చేయడానికి, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, పెయింటింగ్ వంటి పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి, కోయ డ్యా న్స ట్రూప్స, కొమ్ము కోయ, రేలా డ్యా న్స్ ట్రూప్స్, పెయింటింగ్ వంటివాటిని చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి ఆర్థిక సహాయం అందించటానికి ఉపయోగిస్తామని తెలిపారు.

ఈ నెల 16న సమ్మక్క సారలమ్మ అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభంకానుంది. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది. సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు.

TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు

వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర ప్రారంభం అవుతుంది. అయితే.. మహాజాతరకు వారం రోజుల ముందు జరిగే పూజా కార్యక్రమాలకు మండమెలిగె పేరిట పండుగ నిర్వహిస్తారు. ఇది ప్రారంభం అయితే..మహాజాతర మొదలట్లేనని ఆదివాసీలు భావిస్తారు. గతంలో నిర్వహించిన సంప్రదాయం ప్రకారమే ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. మండమెలిగె పండుగ రోజు కన్నెపల్లి, మేడారం గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాల్లో కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు.

రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షా తోరణాలు కడతారు. గ్రామ దేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మ, ఎర్రమ్మ, మైసమ్మలకు పూజలు చేస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జాతర జరగాలని, అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడాలని వేడుకుంటారు. ఇక జాతర సమీస్తుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

ట్రెండింగ్ వార్తలు