Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేయొచ్చు.

Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video

Viral Video: మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేయొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..

ప్రస్తుతం బిజీలైఫ్ లో ఎవరి పనిలో వారు బిజీగా ఉంటున్నారు. కొంతమందికైతే తినేందుకు తగిన సమయం కూడా ఉండని పరిస్థితి. మన ఇంట్లో వారు, స్నేహితుల్లో చాలా మంది ఆఫీస్ కు లేట్ అవుతుందని తినకుండానే వెళ్తుండటం మనం చూస్తుంటాం. అలాంటి వారికి ఈ వీడియోలో డైనింగ్ టేబుల్ భలే ఉంటుంది. ఈ వీడియో చూస్తుంటే నవ్వొస్తున్నప్పటికీ.. రాబోయే కాలంలో మన జీవన విధానం కూడా ఇలా మారే అవకాశాలు కళ్లముందే కనిపిస్తున్నాయి.

ఈ వీడియోలో నలుగురు వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చొని తమకిష్టమైన పదార్థాలను తింటూ ఉన్నారు. ఆ టేబుల్ ఓ మోటార్ బైక్ వలే ఉంది. ఈ టేబుల్ మీదనే పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ సైతం కొట్టించినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో వారు తమ తమ ప్రాంతాలకు చేరుకొనేందుకు తినుకుంటూనే చేరుకున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను అబ్బుర పరిచింది. దీనినే ఇ- మొబిలిటీ (I guess this is e-mobility. Where ‘e’ stands for eat) అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో ‘ఇ’ అంటే తినడం అని రాసుకొచ్చాడు. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.