Telugu Folk Songs: ట్రెండ్ మారింది.. ఫోక్ మీద ఫోకస్ పెరిగింది!

తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్..

Telugu Folk Songs: ట్రెండ్ మారింది.. ఫోక్ మీద ఫోకస్ పెరిగింది!

Telugu Folk Songs

Telugu Folk Songs: తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్ కే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మద్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మ్యూజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏదైనా పాపులర్ ఫోక్ సాంగ్స్ తో హిట్ కొడుతున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు.

Pragathi: ‘నాగిని’ పాటకు ప్రగతి ఇరగదీసే స్టెప్పులు.. వీడియో వైరల్‌

లేటెస్ట్ గా బన్నీ-సుకుమార్ మూవీలో సామి సామి అంటూ టీజింగ్ గా సాగే పాట ఫోక్ హిట్స్ లో టాప్ లెవల్లో నిలుస్తోంది. తన ప్రతి సినిమాలో ఫోక్ సాంగ్ కాకపోయినా.. కనీసం ఫోక్ బీట్ అయినా ఉండేలా చూసుకునే పవన్ కళ్యాణ్.. తన అప్ కమింగ్ మూవీ భీమ్లానాయక్ లో ఫోక్ టచ్ తో భీమ్లానాయక్ లో దుమ్ములేపారు. ఆడ గాదు.. ఈడ గాదు అంటూ ఫోక్ ఆర్టిస్ట్ కిన్నెర మొగులయ్య జానపద పాటకు మోడర్న్ టచ్ ఇచ్చిన భీమ్లానాయక్ పాట ఇంకా ట్రెండ్ అవుతోంది.

Sai Pallavi: బ్యూటీ విత్ నాచురాలిటీ సాయిపల్లవి.. గ్యాలరీ

ఫోక్ సాంగ్స్ లో బాగా రిజిస్టర్ అయి ఉన్న పాటలకి సినిమాటిక్ మ్యూజిక్ తో ఇంకాస్త ఫేమస్ చేస్తున్నారు మేకర్స్ . నాగశౌర్య హీరోగా థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన వరుడు కావలెను సినిమాలో దిగు దిగు దిగు నాగ పాట ఫోక్ ఆడియన్స్ నేకాదు.. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందర్నీ అలరించింది. నాగశౌర్య దిగు దిగు దిగు నాగ అంటే ఈ హీరో మాత్రం మాత్రం మందులోడా, ఓరి మాయలోడా అంటూ ఫుల్ జోష్ లో పాట రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, కరుణకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గా రిలీజ్ అయిన మందులోడా ఫోక్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది.

Sukumar Special Song’s: సుకుమార్ స్పెషల్ సాంగ్స్ అంటే కిర్రాక్కే!

పాటల విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యని మాస్ హీరో గోపీచంద్ కూడా ఈ సారి మాంచి తెలంగాణ ఫోక్ సాంగ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కిన సీటీ మార్ సినిమాలో జ్వాలారెడ్డి పాట.. తెలంగాణలో పాపులర్ అయిన పోరు తెలంగాణను ఇన్స్ పిరేషన్ గా తీసుకుని తెరకెక్కించారు. ఈ సీజన్ లో రిలీజ్ అయిన ఫోక్ సాంగ్స్ అన్నింటిలో సూపర్ హిట్ అయిన పాట సారంగదరియా. తన సినిమాల్లో ఫోక్ సాంగ్ ఉండేలా చూసుకునే శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీలో కూడా మాంచి ఫోక్ సాంగ్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. సారంగధరియా అంటూ సాంగే ఈ అందమైన జానపదానికి సాయిపల్లవి తన యాక్టింగ్ ని యాడ్ చేసి అందాన్ని ఇంకాస్త పెంచేయడంతో ఈ పాట రికార్డ్స్ భరతం పట్టింది.