RRR Movie : మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ వచ్చేస్తోంది..

స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ కాబోతోంది..

RRR Movie : మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ వచ్చేస్తోంది..

Rrr Movie

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’.. షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్‌కి వచ్చెయ్యడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది మూవీ టీం.

సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ రైట్స్ టి-సిరీస్, లహరి మ్యూజిక్ సంస్థలు హయ్యెస్ట్ ప్రైజ్‌కి దక్కించుకున్నాయని అప్‌డేట్ ఇచ్చిన టీం.. మంగళవారం ఉదయం మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ కాబోతోంది.

ఆగస్టు 1వ తేది ఉదయం 11 గంటలకు ఈ క్రేజీ మూవీ నుండి ‘దోస్తీ’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. సిరివెన్నెల లిరిక్స్ రాయగా, తెలుగులో హేమచంద్ర, అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళ్), విజయ్ జేసుదాస్ (మలయాళం), యాసిన్ నిజార్ (కన్నడ) భాషల్లో ఈ పాట పాడారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఐదు లాంగ్వేజెస్‌లో ఐదుగురు లీడింగ్ సింగర్స్ పాడిన ఈ సాంగ్ ఫ్యాన్స్, ఆడియన్స్, మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందని చెప్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం.