Acne Problem : వర్షాకాలంలో వేధించే మొటిమల సమస్య!

వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఆహారపదార్ధాలను తినాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలైతే పర్వాలేదు. అలా కాకుండా నూనెలతో తయారైన వేడివేడి పకోడి వంటి ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Acne Problem : వర్షాకాలంలో వేధించే మొటిమల సమస్య!

Acne Problem : సీజన్ల వారిగా చర్మ రక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించటం అన్నది చాలా ముఖ్యం. చర్మసౌందర్యానికి సంబంధించి చాలా మందిని వేధించే సమస్య ముఖంపై మొటిమలు. ప్రధానంగా వర్షకాలంలో మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. దీనికారణం చర్మం జిడ్డుతత్వంతో నిండి ఉండటమే. వర్షాకాలంలో తేమ శాతం పెరగటంతో ఇది మొటిమలు మచ్చలకు దారితీసే బాక్టీరియల్ కు అనుకూలంగా మారుతుంది. అదేసమయంలో జిగురు వంటి సెబమ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మొటిమలు అధికంగా వస్తాయి.

వర్షాకాలంలో మొటిమలు రాకుండా నివారించుకోవాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం మంచిది. ఎందుకంటే వర్షకాలంలో చాలా మంది వేడివేడిగా ఆహారపదార్ధాలను తినాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలైతే పర్వాలేదు. అలా కాకుండా నూనెలతో తయారైన వేడివేడి పకోడి వంటి ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. వర్షకాలంలో మొటిమలు రాకుండా చూసుకోవాలంటే కొన్ని ఆహారాల జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మం జిడ్డుతత్వం కలిగిన వారు వర్షకాలంలో పాలు తాగటం వల్ల వాటి ప్రభావం హార్మోన్లపై పడి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో బచ్చలి కూర ఎక్కువగా తినడం వల్ల మొటిమల సమస్య వస్తుంది. ఇందులో ఉండే అయోడిన్ పరిమాణమే ఇందుకు కారణం. కాబట్టి దీనిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. అధిక గ్లైసెమిక్ ఆహారాలలో కేకులు, చాక్లెట్, స్వీట్ డ్రింక్స్, ఐస్ క్రీం, శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, బంగాళదుంపలు, వైట్ రైస్ వంటి వాటిని తినటం తగ్గించాలి. వీటి వల్ల కూడా శరీరంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.