Samantha : ‘పుష్ప’ ఐదో పాట అదిరిపోద్దంతే.. సమంత ఐటమ్ సాంగ్ కన్‌ఫామ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల ‘పుష్ప’ లో సమంత స్పెషల్ సాంగ్..

Samantha : ‘పుష్ప’ ఐదో పాట అదిరిపోద్దంతే.. సమంత ఐటమ్ సాంగ్ కన్‌ఫామ్

Sam

Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప’ ప్రమోషన్స్ హోరెత్తిపోతున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పుష్ప రాజ్ ఇంట్రో వీడియో, క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, మూడు పాటలు ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. నవంబర్ 19న ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే ఊరమాస్ పాటను విడుదల చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేసిన టీం సోమవారం మరో కొత్త అప్‌డేట్ ఇచ్చింది.

Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

స్టార్ హీరోయిన్ సమంత ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్ చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ కన్ఫమ్ అయినా గాసిప్ అనుకున్నారు చాలా మంది. కట్ చేస్తే.. సామ్ తమ సినిమాలో ఫిఫ్త్ సాంగ్ చెయ్యబోతుందంటూ అఫీషియల్‌గా తెలియజేశారు మేకర్స్.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

‘పుష్ప’ టీంలోకి సమంతకు వెల్‌కమ్ చెబుతూ.. ఈ ఆల్బమ్‌లో ఐదో పాట అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. బన్నీ -సామ్ ఇంతకుముందు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీలో యాక్ట్ చేశారు. అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ లో అదరగొట్టేసింది సామ్. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బన్నీ – సుక్కు – దేవిల కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు ప్రూవ్ చేశాయి. వాటిని మించి ‘పుష్ప’ ఉండబోతోంది. సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.