The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకుని.. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని..

The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?

The Warriorr: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకుని.. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ ఇప్పుడు కేవలం తెలుగుతో పాటు దక్షణాది భాషలపై కన్నేసి సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి ది వారియర్ టైటిల్ కూడా ప్రకటించారు.

The Warrior : వారియర్ కి విలన్‌గా గురు.. మాన్‌స్టర్ అంటూ రామ్ ట్వీట్..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోండగా.. రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కృతిది ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ రోల్ అని.. ఇందులో బోల్డ్ గా కనిపించనుందని ఇప్పటికే సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుండగా.. ఈ సినిమాకి ఆమె అందం బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో క్రేజీ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఇందులో రామ్ ఎలా ఉంటాడో కూడా ఫస్ట్ లుక్ లో చూపించేశారు.

THE WARRIOR : ‘వారియర్’ గా ఉస్తాద్ రామ్..

కాగా, రామ్ క్యారెక్టర్ కి మతిమరుపు అని, దాంతో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుందని ఓ ప్రచారం మొదలైంది. ఒకవైపు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటూనే రామ్ క్యారెక్టర్ లోనే ఫుల్ ఫన్ ఉంటుందట. ఎలాగూ కథ, కథనం పరుగులు పెట్టిస్తూ సినిమాలు తీయడంలో లింగుస్వామి మంచి స్పెషలిస్ట్. అందుకే.. రామ్ తో సినిమా అనౌన్స్ చేయగానే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తంగా అన్నీ సక్రమంగా కుదిరితే రామ్ కెరీర్ లోనే ఇదో బెస్ట్ సినిమా అయ్యే చాన్స్ కనిపిస్తుంది.