Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ మంచి విషయం చెప్పారు. ఇటీవల స్టార్ హీరోల సినిమాలకి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఈ నిర్ణయాన్ని................

Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

Dil Raju

F3 :  వెంకటేశ్‌, వరుణ్ తేజ్ హీరోలుగా గతంలో వచ్చిన ‘F2’ సినిమా మంచి విజయం సాధించి ఫ్యామిలీ ఆడియన్స్ తోనే 100 కోట్లు సాధించింది. దీంతో దానికి సీక్వెల్ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ‘F3’ సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమాలో ఉన్న తారాగాణంతోనే ఈ సినిమా తీశారు. సోనాల్ చౌహన్, అలీ, సునీల్ లాంటి వారిని మరింత ఫన్ కోసం జత చేశారు. ‘F3’ సినిమా మే 27న విడుదల అవ్వనుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది.

ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ మంచి విషయం చెప్పారు. ఇటీవల స్టార్ హీరోల సినిమాలకి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఈ నిర్ణయాన్నివ్యతిరేకించారు. టికెట్ రేట్లు పెంచితే కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు. కానీ టికెట్ రేట్లు పెంచడంతో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయి నష్టాలు మిగిల్చాయి. దీని మీద గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ‘F3’ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచి మళ్ళీ చేతులు కాల్చుకుంటారా అని అనుమానాలు తలెత్తాయి. అసలే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబాలతో కలిసి వస్తారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా దూరమవుతారని అర్ధం చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు.

Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పదుకొణె..

 

దీంతో తాజాగా జరిగిన ప్రెస్‌మీట్ లో దిల్‌రాజు ‘F3’ టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఎఫ్‌ 3 సినిమాకి టికెట్‌ ధరలు పెంచడం లేదు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమాను మీ ముందుకు తెస్తున్నాం” అని తెలిపారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మిగిలిన ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.