WhatsApp : 3 మిలియన్ల వాట్సాప్ ఖాతాలు బ్లాక్

హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టే ఉద్దేశంతో వాట్సాప్ 3 మిలియన్ల ఖాతాలను బ్లాక్ చేసింది.

WhatsApp : 3 మిలియన్ల వాట్సాప్ ఖాతాలు బ్లాక్

Whatsapp

WhatsApp : 2021 జూన్ – జులై నెలల్లో 3 మిళియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించడం కోసం ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. యాప్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందుకున్నసమాచారం బేస్ చేసుకొని ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ఖాతాలను నిషేదించింది.

కొత్త ఐటీ చట్టం 2021కి అనుగుణంగా వాట్సాప్ తన యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ బయటకు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 వరకు 46 రోజుల వ్యవధిలో యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా.. దాంతోపాటు స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. తప్పుడు సందేశాలు వ్యాప్తి చేస్తున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తమను సంప్రదించాలంటే యూజర్లు wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని తెలిపింది.

కాగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 200 కోట్లు దాటింది. ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.