Stars Bike Collection : ట్రెండీ బైకులపై మనసు పారేసుకుంటున్న స్టార్స్..

సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌ లోనూ సూపర్ స్పీడ్ బైక్‌లతో వీర విహారం చేస్తున్నారు మన స్టార్స్..

Stars Bike Collection : ట్రెండీ బైకులపై మనసు పారేసుకుంటున్న స్టార్స్..

Stars Bike Collection

Stars Bike Collection: సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో ఆడియన్స్ అటెన్షన్ కోరుకునే ఫిలిం స్టార్స్.. ట్రెండీ బైకులపై మనసు పారేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్పీడ్ బైక్‌లతో వీర విహారం చేస్తున్నారు. కాకపోతే ఆ క్రేజీనెస్ అప్పుడప్పుడు.. ఇప్పటి సాయి ధరమ్ తేజ్ స్టోరీలా కష్టం తెచ్చిపెడుతోంది.

Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ?

ఇది రీసెంట్‌గా రిలీజైన ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్. రిటైర్ స్టేజ్ దాటినా మాస్‌ను అట్రాక్ట్ చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై దర్శనమిచ్చారు రజినీ కాంత్. ఇక హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ ఫస్ట్ లుక్‌లో పవన్ కల్యాణ్ సైతం స్పోర్ట్ బైక్ పైనే షో చేశారు. ట్రిపుల్ ఆర్ నుంచి ఆమధ్య వచ్చిన ఓ పోస్టర్‌లో కూడా ఎన్టీఆర్, చరణ్ వింటేజ్ బైక్‌లో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇలా కొందరు స్టార్ట్స్ సినిమాల్లో బైక్‌పై స్టైలిష్ పోజు కొడుతూ ఉంటే.. బయట కొందరు హీరోలు హవా సృష్టిస్తున్నారు. కానీ హై స్పీడ్‌తో దూసుకెళ్లే బైక్‌ మన రోడ్లపై నడిపించి సాయి ధరమ్ తేజ్‌లా అప్పుడప్పుడు ఇబ్బందుల పాలవుతున్నారు.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

చిరు, నాగ్ వంటి సీనియర్ స్టార్స్ బైక్‌లపై ఒకప్పుడు ఫోజలిచ్చినవారే. జనరేషన్ మారిన తర్వాత ఇప్పుడంతా ఇంపోర్టెడ్ బైక్స్ దే హవా. పవర్ స్టార్‌కి బైకులంటే పిచ్చి.. ఆ ఇష్టమే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి వచ్చిందంటారు. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నది పవన్ కల్యాణే. వింటేజ్ వెహికల్స్‌తో పాటు ఇంపోర్టెడ్ బైక్స్ ఎక్కువగా తన సినిమాల్లో వాడుతుంటారు పవర్ స్టార్. రియల్ లైఫ్‌లో కూడా బైక్ డ్ర్రైవ్‌ని బాగా ఇష్టపడే పవన్.. పాలిటిక్స్‌లోకి రాకముందు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టేవారని అంటారు.

Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్ పక్కన టిఫిన్ చేసిన ‘ఐకాన్ స్టార్’

బైక్‌లంటే బాగా ప్యాషన్ ఉన్న మరో హీరో ఎన్టీఆర్. ఏపీలో తొలి హార్లీ డేవిడ్‌సన్ బైక్ తారక్ పేరు మీదే ఉందంటారు. మూవీ షెడ్యూల్స్ లేకపోతే హెల్మెట్ పెట్టుకుని.. ఎవ్వరకీ కనిపించకుండా హైదరాబాద్ రోడ్లపై సందడి చేస్తుంటారు తారక్. ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఇంపోర్టెడ్ బైక్స్ ఉండగా.. ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బైక్ కలెక్షన్‌తో అట్రాక్ట్ చేసే టాలీవుడ్ స్టార్ ప్రభాస్. ‘మిర్చి’, ‘సాహో’ లాంటి సినిమాల్లో రెబల్ స్టార్ బైక్ రేసింగ్, స్టంట్స్‌తో ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. ప్రభాస్ దగ్గర ప్రస్తుతం 6 రకాల వెరైటీ బైక్స్ ఉన్నాయని టాక్.

Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

అల్లు వారబ్బాయి దగ్గర 5 కాస్ట్‌లీ బైక్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ బైక్‌పై ఫ్యామిలీ రైడ్ చేసేందుకు ఇష్టపడతారు. కోలీవుడ్ స్టార్ అజిత్ ఏకంగా బైక్‌పై వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. రియల్ లైఫ్ బైక్ రేస్ లంటే ఇంట్రెస్ట్ చూపించే అజిత్.. ఇప్పుడు స్పోర్ట్స్ బైక్‌పై రష్యాను చుట్టేస్తున్నాడు. మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు కూడా బైక్స్ అంటే క్రేజీనెస్ ఉంది. కానీ హైస్పీడ్ బైక్స్ మోజుతో సినీ ప్రముఖులు కొందరు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ వ్యవహారం కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా టాలీవుడ్ స్టార్స్‌ని ఒక్కసారి షాక్‌కి గురిచేసింది.