Telugu Film Promotions: టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్.. ఎటు చూసినా ప్రమోషన్ల మోతే..!

ధియేటర్లు కళకళలాడబోతున్నాయి.. వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ లతో పండగ చేసుకోబోతున్నారు జనాలు. ధియేటర్లో ఈ హడావిడి ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అవ్వకముందే.. ప్రమోషన్స్ తో తెగ సందడి..

Telugu Film Promotions: టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్.. ఎటు చూసినా ప్రమోషన్ల మోతే..!

Telugu Film Promotions

Telugu Film Promotions: ధియేటర్లు కళకళలాడబోతున్నాయి.. వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ లతో పండగ చేసుకోబోతున్నారు జనాలు. ధియేటర్లో ఈ హడావిడి ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అవ్వకముందే.. ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తున్నాయి సినిమాలు. బ్యాక్ టూ బ్యాక్ సాంగ్ రిలీజ్ లు, ట్రైలర్ రిలీజ్ లు, సక్సెస్ మీట్లు ఇలా ప్రమోషన్లత మోత మోగించేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత కాంపిటీషన్ లో సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆడియన్స్ లో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయడానికి కంటిన్యూయస్ గా సినిమాకు సంబందించి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్లు హోరెత్తిస్తున్నారు. ఈప్రమోషన్లను పీక్స్ లో తీసుకెళ్తున్న సినిమా ట్రిపుల్ ఆర్.

రాజమౌళి డైరెక్షన్లో.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, అజయ్ దేవ్ గన్, ఆలియా భట్ తో పాటు హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మూడు నిమిషాలున్న ఈ ట్రైలర్ తో శాంపిల్ సినిమా చూపించేశారు రాజమౌళి. ట్రైలర్ రిలీజ్ కే వందల ధియేటర్లు బుక్ చేసి.. సినిమా మీద ఆడియన్స్ క్రేజ్ ని పీక్స్ లో చూపించింది. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ రిలీజ్ సందడి మామూలుగా లేదు.. ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో అభిమానులు రచ్చరచ్చ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సెట్ చెయ్యడమే కాదు. జనవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ని ఎవరెస్ట్ లెవల్లో పెంచేసింది.

ట్రిపుల్ఆర్ కంటే ముందే.. నెక్ట్స్ వీక్ డిసెంబర్ 17న ధియేటర్లోకొస్తున్న పుష్ప సినిమా చేసే సందడి మామూలుగా లేదు. ఇదిగో పాట.. అదిగో సీన్ అంటూ ప్రమోషన్లతో సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ రోజురోజుకీ పెంచేస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నపుష్ప సినిమా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది. డిసెంబర్ 12న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ప్లాన్ చేసి ప్రమోషన్లను డబుల్ చేస్తోంది పుష్ప. తగ్గేదే లేదంటూ బన్నీ ఫుల్ మాస్ యాక్షన్ మీద ఎంత ఇంట్రస్ట్ ఉందో.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సమంత పాట మీద కూడా అంతే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు జనాలు. అందుకే సినిమాకే హైలెట్ అయిన పాటని చూపించి ప్రమోషన్లను పీక్స్ కి తీసుకెళ్లారు టీమ్. ఊ అంటావా ..ఊహూ అంటావా అంటూ సమంత ఫాన్స్ కి ఇంకాస్త ఫైర్ యాడ్ చేసింది.

డిసెంబర్ లాస్ట్ వీక్ లో క్రిస్ మస్ కానుకగా రిలీజ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ కూడా ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబందించి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మెలొడియస్ సాంగ్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని హోల్డ్ చేసింది. అంతేకాదు బెంగాల్ రెబల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎరేంజ్ మెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు నాని అండ్ టీమ్. సంక్రాంతి రిలీజ్ సినిమాలు కూడా ఇంకా నెల రోజులు టైమున్నా కూడా ప్రమోషన్లవిషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మిగతా సినిమాలతో పోటీ పడుతూ ఒకదానికిమించి టీజర్లు, పాటలు, వీడియోలు రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలో ప్రమోషన్లు సాలిడ్ గా చేస్తున్న సినిమా భీమ్లానాయక్.

సంక్రాంతి బరిలో ఉన్న భీమ్లానాయక్ అయితే ప్రమోషన్ల విషయంలో ఫస్ట్ నుంచి స్పీడ్ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుంచి ఏదోక అప్ డేట్ ఇస్తున్న భీమ్లానాయక్ టీమ్.. ఇప్పటికే వరుస పెట్టి 4 పాటలు, హీరో టీజర్స్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. త్వరలోనే మరో సాలిడ్ టీజర్ కి రెడీ అవుతోంది భీమ్లానాయక్. సంక్రాంతి రిలీజ్ కు రెడీగా ఉన్న రాధేశ్యామ్ కూడా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. మిగతా పాన్ ఇండియా సినిమాల్లా అన్ని పాటలు ఒకేసారి కాకుండా బాలీవుడ్ లో సాంగ్ ని ఒకసారి, మిగతా లాంగ్వేజెస్ లో మరోసారి సాంగ్స్ రిలీజ్ చేస్తోంది రాధేశ్యామ్ టీమ్. అంతేకాదు.. సాంగ్ ప్రోమోలు, ఫుల్ సాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది రాధేశ్యామ్.

ఈ సినిమాలన్నీ రిలీజ్ అవ్వడానికి ప్రమోషన్లు చేస్తుంటే.. బాలయ్య అఖండ మూవీ మాత్రం.. ఆనందంతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అఖండ 100కోట్ల కలెక్షన్లను దగ్గరవడంతో.. అఖండ విజయోత్సవ జాతర ప్లాన్ చేశారు టీమ్.