Tollywood Heroes : లుంగీ కట్టారు.. అదరగొట్టారు..

చిన్నా, పెద్దా తేడా లేకుండా మాస్ టచ్ కోసం లుంగీతో ఎక్స్‌పెరిమెంట్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి మన హీరోలకు..

Tollywood Heroes : లుంగీ కట్టారు.. అదరగొట్టారు..

Tollywood Heroes In Lungi Avatar

Tollywood Heroes: మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే మన హీరోలు యంగ్ అప్పీల్ కోసం లుంగీనే నమ్ముకుంటున్నారు. సూటు, బూటు వేసి ఎంత స్టైలిష్‌‌గా తయారైనా.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరేమో కానీ, గళ్ల లుంగీ కట్టి, మాస్ స్టైల్లో రెండు స్టెప్పులేస్తే దెబ్బకి థియేటర్లు ఈలలు, కేకలతో దద్దరిల్లిపోవాల్సిందే. మరోసారి లుంగీలతో ఆడియన్స్‌లో జోష్ పెంచుతున్న హీరోలెవరో చూద్దాం.

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాగర్ చంద్ర డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ -రానా చేస్తున్న సినిమా.. ‘భీమ్లా నాయక్’.. ఈ మూవీలో ‘భీమ్లా నాయక్’ క్యారెక్టర్‌లో పవర్ స్టార్ లుంగీ కట్టుకుని బాక్సాఫీస్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. పక్కా మాస్ ఎటైర్‌తో పవర్ స్టార్ పిక్ అండ్ గ్లింప్స్ చూసిన ఆడియన్స్.. ‘ఇదేం మాస్ రా మామా’ అంటూ సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందే ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి పలు సినిమాల్లో లుంగీలో క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ఆడియన్స్‌లో జోష్ పెంచేశారు .

Pawan Kalyan

లుంగీ లుక్‌కు సీనియర్, యంగ్ హీరోలు అన్న డిఫరెన్స్ లేదు.. సక్సెస్ కోసం అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. రామ్ చరణ్ కూడా లుంగీలో కనిపించి ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశారు. సుకుమార్‌ డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి అబ్బాయిగా ఎక్కువ సేపు లుంగీలోనే కనిపించాడు చెర్రీ. చరణ్‌ లుక్‌‌కి టాలీవుడ్‌ ఫిదా అయ్యింది.

Ram Charan

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూడా లుంగీ లుక్‌‌కి ఓటేశాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో అబ్బో లుంగీతో రచ్చరచ్చ చేశారు. ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ‘వచ్చాడయ్యో సామి’ అనే పాట కోసం వైట్‌ అండ్‌ వైట్‌ పంచెతో కనిపించిన మహేష్, ‘శ్రీమంతుడు’ సినిమాలోనూ కంప్లీట్ మాస్ లుక్‌లో గళ్ల లుంగీ కట్టి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. అంతకుముదు ‘పోకిరి’ లో పాటలో లుంగీ కట్టారు.

Mahesh Babu

లుంగీతో అల్లాడించిన మరో హీరో అల్లు అర్జున్. ‘డీజే దువ్వాడ జగన్నాథ్’ సినిమా కోసం పంచె కట్టుతో పాటు లుంగీలోనూ కనిపించాడు బన్నీ. ఈ సినిమాలో బ్రాహ్మణుడిగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్.. క్లాస్ లుక్‌లోనూ తను స్టైల్ ఐకానే అని ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కోసం టాప్ లేచిపోద్ది పాటలో లుంగీతో ఊర మాస్ డ్యాన్స్ చేసి మాస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు.

Bunny - Vijay Sethupathi

తన కెరీర్‌కి మంచి మైలేజ్ ఇచ్చిన ‘మిర్చి’ సినిమా కోసం ప్రభాస్ పంచె కట్టులో కనిపించారు. అయితే అందరు హీరోల్లా బిల్డప్ సీన్స్ కోసం కాకుండా ఓ పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్‌లో పొలం పనిచేసే కూలీలా మారిపోయాడు. ప్రభాస్ ఫిజిక్‌కి ఆ లుక్ సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర కొండ కూడా నేనేం తక్కువా అంటూ పక్కా పల్లెటూరి అబ్బాయిలా లుంగీతో అలరించారు. కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయిన ‘గీతగోవిందం’ సినిమాలో ఓ సాంగ్‌లో లుంగీతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు. సినిమాలోనే కాదు.. పబ్లిక్ ఫంక్షన్స్‌కి కూడా అప్పుడప్పుడు లుంగీతో అటెండ్ అవుతూ తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడు ఈ రౌడీ హీరో.

Prabhas

రానా దగ్గుబాటి – ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీలో పంచెకట్టుతో అదరగొట్టేశారు. నటసింహా నందమూరి ఇప్పటికే పలు సినిమాల్లో లుంగీ, పంచె కట్టుతో ఆకట్టుకున్న బాలకృష్ణ, అప్‌కమింగ్ మూవీ ‘అఖండ’ లో పంచె కట్టులో పంచ్ డైలాగులతో సందడి చెయ్యబోతున్నారు. ‘ప్రేమమ్’, ‘లవ్ స్టోరీ’ సినిమాల్లో నాగ చైతన్య, ‘చావు కబురు చల్లగా’ లో కార్తికేయ, ‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్, ‘గుండెల్లో గోదారి’ లో సందీప్ కిషన్, ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి లాంటి హీరోలంతా లుంగీలో సందడి చేసినవారే.

Balakrishna - Venkatesh

మెగాస్టార్ ‘ముఠామేస్త్రి’ నుండి పలు సినిమాల్లో లుంగీ కట్టి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేశారు. ఎన్టీఆర్, నితిన్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో పాటు సీనియర్లు నాగార్జున, వెంకటేష్.. తమకు బాగా అచ్చొచ్చిన లుంగీని అప్పుడప్పుడు సినిమాల్లో బాగానే వాడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగార్జున కంప్లీట్‌గా పంచె కట్టుతో కనిపిస్తే.. ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేష్ లుంగీతో రచ్చ చేశారు. ఇటీవల ‘నారప్ప’ లో సినిమా మొత్తం పంచెతోనే కనిపించారు. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా మాస్ టచ్ కోసం లుంగీతో ఎక్స్‌పెరిమెంట్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి మన హీరోలకు.

Naga Chaitanya