Tollywood : షూటింగ్స్ ఆపేస్తారా?? ఈ సారి నిర్మాతల వంతు..

ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలు పెరగడం, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం, టికెట్ రేట్లు.. ఇలాంటి సమస్యలపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు........

Tollywood : షూటింగ్స్ ఆపేస్తారా?? ఈ సారి నిర్మాతల వంతు..

Movie Shootings

Movie Shootings :  ఇటీవలే కార్మికుల సమ్మెతో రెండు రోజులు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. థియేటర్లకు జనాలు రాకపోవడంతో, ఓటీటీ ప్రభావంతో సినిమాలకి కష్టాలు తప్పట్లేదు. తాజాగా మరోసారి సినిమా షూటింగ్స్ ఆగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ సారి స్వచ్ఛందంగా ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని తెలుగు సినీ నిర్మాతలు అనుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ నిర్మాతల్లో కూడా రెండు సంఘాలుగా చీలిక వచ్చింది. నిర్మాతల సంఘం ఉండగానే బడా నిర్మాతలు కలిసి సపరేట్ గిల్ట్ పెట్టుకున్నారు. దీనిపై చిన్న నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Nikhil Siddharth : కార్తికేయ టీంకి ఇస్కాన్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్

ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలు పెరగడం, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం, టికెట్ రేట్లు.. ఇలాంటి సమస్యలపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షూటింగ్‌లు ఆపాలని భావిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగ్‌లు ఆపేస్తారని టాలీవుడ్ సమాచారం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికిన తర్వాతే షూటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోనుంది. అయితే దీనిని చిన్ననిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. మరి షూటింగ్స్ ఆగుతాయా, ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుందా తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.