Senior Hero’s: రిటైర్మెంట్ టైమ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్న సీనియర్ స్టార్స్!

ఏజ్ మాకు ప్లాబ్రం కాదంటున్నారు. రిటైర్మెంట్ టైమ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్నారు. సౌత్ టు నార్త్ మాక్సిమమ్ ఇండస్ట్రీల్లో సీనియర్ హీరోలు ఇంకా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతున్నారు.

Senior Hero’s: రిటైర్మెంట్ టైమ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్న సీనియర్ స్టార్స్!

Senior Hero's

Senior Hero’s: ఏజ్ మాకు ప్లాబ్రం కాదంటున్నారు. రిటైర్మెంట్ టైమ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్నారు. సౌత్ టు నార్త్ మాక్సిమమ్ ఇండస్ట్రీల్లో సీనియర్ హీరోలు ఇంకా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతున్నారు. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని ఇండియన్ ఆడియెన్స్ తో సూపర్ స్టార్స్ అనిపించుకుంటున్నారు సీనియర్ హీరోలు. వీళ్లు సీనియర్స్.. అయినా ఇప్పటికీ సూపర్ స్టార్స్. ఇండస్ట్రీకొచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. యంగ్ హీరోస్ హిట్ కొడుతున్నా.. ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తున్నారు సీనియర్ స్టార్స్. మ్యాజిక్ చేయడమే కాదు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

టాలీవుడ్ నే తీసుకుందాం ఎవరు తక్కువని.. ఇప్పటికీ చిరూ, బాలయ్య, నాగ్, వెంకీల నుంచి సినిమాలొస్తున్నాయంటే జనం ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు. 61 ఏళ్ల బాలయ్య అఖండతో సంచలనం సృష్టించి.. అన్ స్టాపబుల్ గా దూసుకెళ్లడం రీసెంట్ గానే జరిగింది. 62 ఏళ్ల నాగ్ బంగార్రాజులా మెరిసిపోతున్నాడు. హోస్ట్ గా హీరోగా దడదడలాడిస్తున్నారు. 61లో ఉన్న వెంకీమామ సందడీ ఏమాత్రం తగ్గలేదు. నారప్ప, దృశ్యం2లతో రీసెంట్ ఓటీటీ హిట్స్ ఇచ్చి హుషారుగా కొత్త షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

66 ఏళ్ల చిరూ ఐదు సినిమాలను లైన్ లో పెట్టారు. యంగ్ డైరెక్టర్స్ సైతం మెగాస్టార్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక చిరూ సినిమా రిలీజ్ అంటే ఇప్పటికీ థియేటర్స్ దగ్గర హడావిడీ అలాగే.. అప్పటిలాగే ఉంది. రజనీకాంత్.. 71ఏళ్ల వయసులోనూ యంగ్ స్టార్స్ కి సాధ్యం కాని రికార్డులను తిరగరాస్తున్నారు. అన్నాత్తే లాంటి రొటీన్ సినిమా.. కోట్లు కొల్లగొట్టిందంటే సూపర్ స్టార్ గ్రేస్ కారణం. 67లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇప్పటికీ కుర్రాడిలాగే కష్టపడుతున్నారు. అటు మలయాళీ స్టార్స్ మమ్ముట్టి 70.. మోహన్ లాల్ 61ని క్రాస్ చేసినా.. సూపర్ స్టార్ డం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Raveena Tandon: బ్రదర్‌తో సంబంధం అంటగట్టారు.. గత జ్ఞాపకాలను తలచుకున్న రవీనా!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఏజ్ కూడా బార్ అయిపోతుంది. సల్మాన్, షారుఖ్, ఆమీర్ ఈ ముగ్గరు ఖాన్స్ ఇప్పుడు 56 ఏళ్ల వయసులో ఉన్నారు. అయినా సరే.. రిటైర్మెంట్ ఏజ్ దగ్గరపడుతున్నా సరే.. వీళ్ల సినిమా వస్తుందంటే నార్త్ అంతా సందడే సందడి కనిపిస్తుంది. సినిమా అదరలే కానీ వందల కోట్లను క్రాస్ చేయడం వీళ్లకు చాలా ఈజీ. 54 ఏళ్లలో కుర్రాడిలా దూసుకుపోతున్న అక్షయ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఎవ్వరికీ సాధ్యం కాని స్థాయిలో ఒకేసారి 8కి పైగా సినిమాలను లైన్లో పెట్టిన అక్షయ్ కుమార్.. 2వేల కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాడు ఒకే సంవత్సరంలో.